Site icon NTV Telugu

Bigg Boss 9: బంధాలకి ఎండ్‌ కార్డ్ వేసిన భ‌ర‌ణి.. నామినేష‌న్స్‌లో ఎవరెవ‌రు ఉన్నారంటే?

Bb9 Namination

Bb9 Namination

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 9లో ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్‌ రౌండ్‌లో హౌస్‌ మొత్తం హీటెక్కిపోయింది. ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కొత్త ఉత్కంఠను రేపింది. టెడ్డీ బేర్‌లను సేఫ్ జోన్‌కి తీసుకెళ్లే గేమ్‌లో చివరగా చేరిన కంటెస్టెంట్స్ నామినేషన్ జాబితాలో చేరడం రూల్‌గా ఉండటంతో హౌస్‌లో టెన్షన్ మొదలైంది. మొదటి రౌండ్‌లో సంజన నామినేట్ కాగా, తరువాతి రౌండ్‌లో భరణి–తనూజ మధ్య తీవ్రమైన వాదన చెలరేగింది. “తనూజ కారణంగానే నేను హౌస్‌ నుంచి బయటకు వెళ్లాను. ఆమె ఒక్కసారి కూడా నన్ను సేవ్ చేయలేదు” అంటూ భరణి ఆవేశంగా మాట్లాడుతూ, తనూజ కూడా ఘాటుగా స్పందించింది. దీంతో వాతావరణం కాసేపు వేడెక్కింది.

Also Read : NC24: దక్షగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ విడుదల

తదుపరి రౌండ్‌లో సంచాలకురాలిగా ఉన్న దివ్య, భరణిని నామినేట్ చేయడం గేమ్‌లో మరో మలుపు తెచ్చింది. టాస్క్ పూర్తయ్యాక భరణి స్పష్టంగా మాట్లాడుతూ – “ఇకపై నా గురించి మాట్లాడొద్దు. మీ గేమ్ మీరు ఆడుకోండి” అంటూ తనూజ, దివ్య తో ఉన్న బంధం ముగిసిందని చెప్పేశాడు. ఇక ఇమ్మాన్యుయేల్ కూడా తనూజ గేమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. “ఆమె సేఫ్ గేమ్ ఆడుతోంది” అని కామెంట్ చేసాడు. అయితే, ఈసారి కూడా సంచాలకులు తనూజను సేవ్ చేయడం హౌస్‌లో చర్చకు దారితీసింది. చివర్లో బిగ్ బాస్ కెప్టెన్ దివ్యకు ప్రత్యేక అధికారం ఇచ్చి, “ఇప్పటివరకు నామినేట్ కాని వారిలో ఒకరిని నామినేట్ చేయాలి” అని ఆదేశించగా, దివ్య నేరుగా తనూజ పేరే చెప్పింది. “ప్రతి టాస్క్‌లో సింపతీ కోసం ఏడుస్తుంది. ఓటమిని అంగీకరించలేక ఏడుస్తూ కూర్చుంటుంది” అంటూ కారణం వివరించింది.

దీంతో ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్: సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి, తనూజ. మొత్తం ఎపిసోడ్‌లో టాస్క్ టెన్షన్, గొడవలు, భావోద్వేగాలతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ప్రేక్షకుల ఓట్లపై ఉంది – ఈ వారంలో ఎవరి గేమ్ స్ట్రాంగ్‌గా నిలుస్తుందో, ఎవరు ఎలిమినేషన్ వైపు అడుగేస్తారో చూడాలి.

Exit mobile version