NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: ఎలిమినేషన్స్ లో బిగ్ ట్విస్ట్.. ఈవారం ఇంటికి వెళ్ళేది ఎవరంటే?

Bigg Boss7

Bigg Boss7

Bigg Boss Telugu 7 This Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ కు కూడా రెడీ అయింది. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారగా బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చాడని తెలుస్తోంది. మరో నాలుగు వారాల్లో ఈ షో ముగియనుండగా ఇప్పటికే హౌస్ నుంచి 10 మంది ఎలిమినేట్ అయిపోయారు.. ఈసారి ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఉత్కంఠగా మారగా ఈ వారం కంటెస్టెంట్ ఎవరూ ఎలిమినేట్ కావడం లేదు. ఇక నిబంధనల ప్రకారం, ప్రతి వారం ఒక కంటెస్టెంట్ తప్పనిసరిగా ఎలిమినేట్ చేయబడాలి, అయితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదని ఇన్‌సైడ్ న్యూస్.

Trisha: అనుచిత వ్యాఖ్యలు.. ఆ నటుడితో ఇక జీవితంలో నటించేది లేదంటూ త్రిష పోస్ట్

డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్ శోభాశెట్టిని కాపాడేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు నిబంధనలను మార్చారని షోని ఫాలో అయ్యే వారు కామెంట్లు చేస్తున్నారు. అనధికారిక పోలింగ్ సర్వేల ప్రకారం చివరి రెండు స్థానాల్లో శోభ, అశ్వినిలు ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వచ్చాయి. అయితే శోభ ఎలిమినేషన్‌ను తప్పించుకునేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎలిమినేషన్‌ లేకుండా చేసేలా చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. శోభ ఎలిమినేషన్ ఖాయమైందని చాలా మంది ప్రేక్షకులు భావించారు, కానీ అది జరగడం లేదు. మరి ఈ వారం శోభ ఎలా కాపాడబడుతుందో చూడాలి. ఈ వారం ఎలిమినేషన్ లేకుండా చేయడానికి ప్రిన్స్ యావర్ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ఉపయోగించబడుతుందని అంచనాలు ఉన్నాయి.