NTV Telugu Site icon

Bigg Boss Telugu 6: హౌస్ లో ఆ పని చేసి అడ్డంగా దొరికిన సింగర్ రేవంత్..?

Revanth

Revanth

Bigg Boss Telugu 6: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రెండు రోజుల క్రితం మొదలైన విషయం విదితమే. ఇక 21 కంటెస్టెంట్ల మధ్య మొదటి రోజు నుంచే గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు చిన్నది గీతూ రాయల్ గురించే చర్చ నడుస్తోంది. అమ్మడు మొదటి రోజునుంచే ఓవనే యాక్షన్ చేస్తూ ప్రతి ఒక్కరికి చిరాకు తెప్పిస్తోంది. మొదటి రోజు నుంచి వర్మ హీరోయిన్ ఇనయాతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఇక మరోపక్క సింగర్ రేవంత్ బిహేవియర్ పై కూడా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని లక్షల మంది చూస్తున్న షో లో బూతులు మాట్లాడుతూ రేవంత్ అడ్డంగా దొరికిపోయాడు. బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడకూడదని ఒక కండిషన్ ఉంది. దాన్ని మీరాడు రేవంత్.

మొదటి రోజు ఇచ్చిన క్లాస్, మాస్ టాస్క్ లో రేవంత్ లోపల వండుకోకూడదు.. గార్డెన్ ఏరియాలోని వండుకోవాలి. దీంతో లోపలికి వచ్చిన రేవంత్ ను గీతూ రాయల్ ఏదైనా తినమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. అయితే టాస్క్ లో ఉన్నానని, ఇక్కడ తింటే మళ్లీ బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తాడని చెప్పుకొచ్చిన ఆమె వదలకుండా నేను ఆర్డర్ చేస్తున్నా కనీసం అరటి పండు అయినా తినమని కోరుతోంది. దీనికి విసుక్కున్న రేవంత్.. నువ్వు ఏ పని చెప్పినా చేస్తా.. బాత్ రూమ్ లు కడగమన్నా.. చివరికి ఇక్కడ ఉన్నవారందరివి కడగమన్న కడుగుతా అంటూ మధ్యలో బూతు పదం వాడాడు. వెంటనే అక్కడ ఉన్న బాలాదిత్య రేవంత్ పై సీరియస్ అయ్యాడు. ఇక దీంతో నాలుక్కర్చుకున్న రేవంత్ బిగ్ బాస్ కెమెరా ముందుకు వచ్చి బూతు మాట్లాడినందుకు సారీ చెప్పి, ఇకనుంచి మాట్లాడనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది