Bigg Boss Telugu 6: బిగ్ బాస్ తెలుగు 6 మొదటి వారంలోనే రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీపోరు నడుస్తోంది. అయితే ఈ వారం మొత్తంలో టార్గెట్ ఎవరయ్యా అంటే రేవంత్ పేరే వినిపిస్తోంది. ప్రతి ఒక్కరు అతడిని తప్పు పట్టేవారిగా మారిపోయారు. తాను ఎంత డిఫెండ్ చేసినా అతడిని ఎప్పుడెప్పుడు బయటికి పంపిచేస్తారా అని ఎదురుచూసినట్లు ఉంటున్నారు కంటెస్టెంట్లు. అసలు అంతలా రేవంత్ ఏం చేస్తున్నాడు అంటే.. నిజాయితీగా ఉంటున్నాడు అనేది కొందరి మాట. ఏదైనా మనసులో దాచుకోకుండా ముఖం మీద నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పుకురావడం అక్కడ ఉన్న కొంతమందికి నచ్చడం లేదని, ఆ మాటలను వారు తీసుకోలేక రేవంత్ ను విమర్శిస్తున్నారు అని అంటున్నారు. ఇక మరికొందరు లక్షల మంది చూస్తున్న షో లో ఎలా ఉండాలి..? అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలి అనేది తెలియదా..? ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు.
ఇక హౌస్ లో రేవంత్ ను టార్గెట్ ను చేసింది ముఖ్యంగా గీతూ అని చెప్పాలి. ఆమె ఒకపక్క అతడితో మంచిగా మాట్లాడుతూనే పక్కకు వెళ్లి ఇతడు సింగర్ ఏంటి..? నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పుకొచ్చింది. ఇక నిన్నటికి నిన్న ఎలిమినేషన్ లో కూడా రేవంత్ ను టార్గెట్ చేసి రేవంత్ ఇలాంటివాడనుకోలేదు.. అతను ఎలిమినేట్ అయితేనే మంచిదని చెప్పుకొచ్చింది. ఇక వీరితో పాటు హౌస్ లో రేవంత్ పై కక్ష కట్టింది ఆరోహి. అతడి మాట్లాడే పద్దతి నచ్చలేదని రంకెలు వేసింది. తాజా ప్రోమోలో ఆ విషయం వెల్లడి అవుతోంది. కెప్టెన్సీ విషయంలో తాను చెప్పిన విషయాన్ని అంగీకరించకుండా రేవంత్ ముందు ముందే క్లాప్స్ కొట్టి మాట్లాడడం, డిఫెక్ట్ అన్న పదం రేవంత్ అన్నాడంటూ ఆమె గొడవకు దిగింది. ఇక చివర్లో రేవంత్ నేను ఇలాంటి చోట ఉండాలనుకోవడం లేదు. నాకు నచ్చడం లేదు.. ఇప్పటికిప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తే వెళ్ళిపోతా అని చెప్పడం విశేషం. మొత్తానికి రేవంత్ అమ్మాయిలతో మాత్రమే గొడవ పడుతుండడంతో ఏంటయ్యా రేవంత్ అమ్మాయిలతో ఇలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.