NTV Telugu Site icon

Biggboss 7: హౌస్ లో కంటెస్టెంట్ కు గుండెపోటు.. రాత్రికి రాత్రి బయటికి

Bava

Bava

Biggboss 7: బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 వారం రోజుల క్రితమే మొదలైంది. తెలుగులో లానే తమిళ్ కూడా ఈసారి గట్టి కంటెస్టెంట్స్ ను తీసుకొచ్చారు మేకర్స్. ఇక ఇక్కడ నాగ్ లానే అక్కడ కమల్ హాసన్ కూడా తప్పు జరిగితే తాటతీస్తూ ఉంటాడు. ఇక తాజాగా ఈ తమిళ్ బిగ్ బాస్ లో అనుకోని సంఘటన జరిగింది. ఈసారి బిగ్ బాస్ లోకి రచయిత, నటుడు బావ చెల్లదురై వచ్చాడు. ఆయన వయస్సు సహకరించకపోయినా కూడా కిచెన్ లో అందరికి హెల్ప్ చేస్తూ కనిపించాడు. ఫిజికల్ టాస్క్ లో ఆయన యాక్టివ్ గా లేకపోవడంతో.. గతవారం బావ చెల్లదురైను కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే గతరాత్రి బావ చెల్లదురై కు ఛాతీలో నొప్పి వచ్చిందని తెలుస్తోంది. అందుకే ఆయన బిగ్ బాస్ కు ఈ విషయాన్నీ తెలియజేశాడు. ఆరోగ్యం సహకరించడం లేదని, వెంటనే తనని ఇంటికి పంపించాలని వేడుకున్నాడు.

Meenakshi Chaudhary: అమాంతం రేటు పెంచేసిన మీనాక్షి.. మహేషా మజాకా?

ఇక ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ బావ చెల్లదురైను రాత్రికి రాత్రే బయటికి పంపినట్లు తెలుస్తోంది. ఇక ఆయన బిగ్ బాస్ తో మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒకసారి బయటికి వెళ్తే.. మళ్లీ బయటికి రాలేరని.. ఇంకోసారి ఆలోచించుకోవాల్సిందిగా బిగ్ బాస్ చెప్పినా కూడా బావ చెల్లదురై.. తాను ఇంట్లో ఉండలేకపోతున్నాను అని, ఆరోగ్యం సహకరించడం లేదని, అన్న మాట మీదనే కట్టుబడి ఉంటాను అని చెప్పడంతో బిగ్ బాస్ ఆయనను బయటికి పంపించేశారు. తెలుగులో మొదటి సీజన్ లో సంపూర్ణేష్ బాబు.. ఇలానే ఉండలేకపోతున్నాను అని చెప్పడంతో డబ్బులు కట్టాలని చెప్పినా.. సంపూ బయటికి వచ్చేశాడు. ఇక తమిళ్ లో వారం రోజులకే ఇలా బయటకి వెళ్లడం ఇదే మొదటిసారి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Show comments