NTV Telugu Site icon

Bigg Boss Swetha: అసభ్యంగా బిగ్ బాస్ శ్వేతకు మెసేజులు.. మీ అమ్మని కూడా ఇలాగే అంటూ!

Swetha Varma

Swetha Varma

Bigg Boss Swetha Responds on Vulgar Comments on Her: తెలుగులో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించింది శ్వేతా వర్మ కొన్ని సినిమాల్లో అయితే ఆమె హీరోయిన్ గా కూడా నటించింది. అయితే నటిగా రాని గుర్తింపు ఆమెకు బిగ్ బాస్ ద్వారా మాత్రం లభించింది. కాస్త క్రేజ్ వచ్చిన తర్వాత బిగ్బాస్ ఆమెను సంప్రదించడంతో బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే చివరి వరకు ఉండకపోయినా తెలుగు వారందరూ గుర్తించే విధంగా మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు కూడా అడపాదడపా చిన్నచిన్న సినిమాలలో పాత్రలు చేస్తూ వస్తున్న ఆమె తాజాగా తన మీద ఒక వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా శ్వేతా వర్మ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఒక వ్యక్తి ఆమె గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు.

Rajini Coolie: లోకేషూ ఏమైందయ్యా నీకు..?

దీంతో బాధపడుతూ శ్వేత వర్మ ఒక మనిషి ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది? అతని అమ్మకి కూడా ఎవరైనా ఇలాగే చెబితే అతను పర్వాలేదు అనుకుంటాడా అని ఆమె ప్రశ్నించింది. అంతేకాదు అతని వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసిన ఆమె ఇలాంటి వాళ్లను చూస్తే సిగ్గేస్తోంది. నాకున్న కాంటాక్ట్ ద్వారా అతని అడ్రస్, అతని కాంటాక్ట్ కూడా సంపాదించాను. అది రియల్ అకౌంటా? ఫేక్ అకౌంటా అని ఆలోచన అక్కర్లేదు అది ఏదైనా తెచ్చిపెట్టే నాకున్న సోర్స్ అలాంటిది. అతని కాంటాక్ట్ అలాగే అడ్రస్ కూడా నేను పోస్ట్ చేయగలను కానీ నేను చేయను. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. ఇది చూసి అతను ఒక గుణపాఠం నేర్చుకుంటే మంచిది. ఇలాంటి దరిద్రపు పనులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటే మంచిది. అంటూ ఆమె పేర్కొన్నారు.