Bigg Boss Season 7 this week Elimination: బిగ్ బాస్ సీజన్ 7లో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కొందరు మేల్ కంటెస్టెంట్స్‌పై నెగిటివిటీ ఉన్నా ఎందుకో ఫీమేల్ కంటెస్టెంట్స్ మాత్రమే ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేటి అవుతున్నారు. ఇప్పటికీ గడిచిన అన్ని వారాల్లో లేడీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి వదిలి వెళ్లిపోయారు. ఇక ఈ వారంలో కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఒక లేడీ పేరు వినిపించగా ఇప్పుడు కొత్తగా మరో అమ్మాయి ఎలిమినేట్ అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 7లో వరుసగా అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో ముగ్గురు అమ్మాయిలను హౌస్లోకి పంపారు.
Krithi Shetty: ఆ ముద్ర మంచిదే కానీ చెరిపేసుకుంటానంటున్న కృతి!
ఒకరకంగా చెప్పాలంటే ముందుగా బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారం ఎలిమినేట్ అయ్యేది శోభా శెట్టి అని ముందుగా వార్తలు వైరల్ కాగా అనూహ్యంగా నయని పావని ఎలిమినేట్ అయినట్టు వార్తలు తెర మీదకు వస్తున్నాయి. బిగ్‌బాస్ 7 ఆరోవారం ఎలిమినేషన్ కోసం మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు. అమరదీప్, ప్రిన్స్ యవర్, తేజ, శోభాశెట్టి, పూజా, అశ్విని, నయని పావని ఈ లిస్టులో ఉండగా వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే రెండు రోజుల ముందు వరకు శోభాశెట్టి, పూజా చివరి స్థానాల్లో ఉండగా ఇప్పుడు అనూహ్యంగా నయని పావని ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన నయని పావని ప్రిన్స్ యావర్‌తో చనువుగా ఉంటూ తను బిగ్ బాస్ సీజన్ 7లో రెండో కెప్టెన్ అవ్వడానికి కూడా కారణం అయింది. ఎందుకో మొత్తానికి ఆమెను బిగ్ బాస్ సాగనంపినట్టు తెలుస్తోంది.