Site icon NTV Telugu

Rohini : లగ్జరీ విల్లా కొన్న బిగ్ బాస్ రోహిణి..

Rohini

Rohini

Rohini : బిగ్ బాస్ బ్యూటీ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె బిగ్ బాస్ తో ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది. అంతకు ముందు సీరియల్స్ తో బాగా క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. బుల్లితెర షోలతో అలరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి రెండుసార్లు అడుగు పెట్టి అలరించింది. అక్కడి నుంచి ఆమె వెను దిరిగి చూసుకోలేదు. తర్వాత కూడా వరుసగా స్టార్ మాలో వచ్చే బుల్లితెర ప్రోగ్రామ్ లో అలరిస్తూ ముందుకు సాగుతోంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె లగ్జరీ విల్లా కొనుగోలు చేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొనుగోలు చేసినట్టు ఆమె వెల్లడించింది.

Read Also : Liquor Prices: మందు బాబులకు బిగ్ షాక్.. మరోసారి మద్యం ధరలు పెంపు?

దీని విలువ రూ.1.7 కోట్లు అని స్వయంగా రోహిణి వెల్లడించింది. ఇక్కడ ఇనుంచి తన న్యూ చాప్టర్ మొదలవుతోందని చెప్పుకొచ్చింది ఈమె. రోహిణి ఇంతటి స్థాయికి ఎదగడంపై ఆమె ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఒకప్పుడు చిన్న ఇంట్లో ఉన్న రోహిణి.. బిగ్ బాస్ తర్వాత కూడా చాలా రోజులు అదే ఇంట్లో గడిపింది. బిగ్ బాస్ లో ఆమె సెకండ్ సారి వెళ్లినప్పుడు 9 వారాలు పాటు ఉంది. ఒకానొక టైమ్ లో ఆమెనే బిగ్ బాస్ విన్నర్ అవుతుందని అనుకున్నారు. కాలేదు.

9వారాల కోసం ఆమె ఏకంగా రూ.18 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంది. రోహిణి ప్రస్తుతం వరుస సినిమాల్లో కూడా నటిస్తోంది. బుల్లితెర ప్రోగ్రామ్స్, అటు సినిమాలు, అలాగే ఈవెంట్లు కూడా చేస్తోంది. అప్పుడప్పుడు సినిమా ప్రమోషన్లు కూడా చేస్తోంది ఈ బ్యూటీ. ఇటు యూట్యూబ్ ఛానెల్ నుంచి కూడా డబ్బు సంపాదిస్తోంది. మొత్తంగా రెండు చేతులతో డబ్బు సంపాదిస్తోంది ఈ బ్యూటీ.

Read Also : Nandigam Suresh: వైసీపీకి షాక్.. మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

Exit mobile version