Site icon NTV Telugu

Bigg Boss Nonstop : కంటెస్టెంట్స్ లిస్ట్… కాంట్రవర్సీకే ఇంపార్టెన్స్ !

Bigg-Boss-Non-Stop

“బిగ్ బాస్ నాన్ స్టాప్” నిన్న సాయంత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అయితే ఓటిటి షోకి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా అషు రెడ్డి హౌజ్ లోకి అడుగు పెట్టగా, తర్వాత మహేష్ విట్టా, ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. అజయ్, స్రవంతి చోకరపు, ఆర్జే చైతూ, యాంకర్ అరియానా, నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, తేజస్వీ మదివాడ, సరయూ రాయ్, యాంకర్ శివ, బిందు మాధవి, హమీదా, అఖిల్ సార్థక్ వరుసగా ఇంట్లోకి వచ్చారు. అయితే ఈ పదిహేడు మందిలో ఎక్కువగా పాత బిగ్ బాస్ కంటెస్టెంట్సే ఉన్నారు. పాత కంటెస్టెంట్లను వారియర్స్ గా, కొత్త వాళ్ళను చాలెంజర్స్ గా ప్రకటించారు.

Read Also : Surekha Konidala : సూపర్ స్టైలిష్ పిక్… చిరు సతీమణి సోషల్ మీడియా ఎంట్రీ

అయితే షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల సంఖ్యను చూస్తే, షో మేకర్స్ వివాదాస్పద కంటెస్టెంట్స్‌పై మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టారని అన్పిస్తోంది. బిగ్ బాస్ మేకర్స్ ఇప్పటికే మునుపటి వెర్షన్‌లలో భాగమైన ముమైత్ ఖాన్, తేజస్వి మదివాడ, అరియానా గ్లోరీ, శివను, శ్రీ రాపాకతో పాటు మహేష్ విట్టా కార్యక్రమంలో భాగమయ్యారు. అయితే ఈ కంటెస్టెంట్లు వాళ్లు ఇంతకుముందు పాల్గొన్న సీజన్లలో వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక హాట్‌స్టార్ డిజిటల్ యాప్‌లో 24X7 ఈ షోను చూడొచ్చు.

Exit mobile version