Site icon NTV Telugu

Bigg Boss Non Stop : ఈవారం బయటకు పంపేది ఇతన్నే ?

Ajay

Ajay

బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు ఎలిమినేషన్ డే. ఎనిమిదో వారంలో బిగ్ బాస్ తెలుగు ఓటిటి షో Bigg Boss Non Stop నుండి ఏ కంటెస్టెంట్ బయటకు వెళ్ళబోతున్నాడో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఈ వారం పోటీదారులకు బిగ్ బాస్ చాలా కఠినమైన టాస్క్‌లు ఇచ్చారు. అయితే శారీరకంగా గాయపడినప్పటికీ ఏ కంటెస్టెంట్ కూడా అంత తేలిగ్గా టాస్క్ ను వదులుకోలేదు. ఇక బిగ్ బాస్ నాన్-స్టాప్ ను ఈ వారం వీక్షకులు బాగా ఆస్వాదించారు. బిగ్ బాస్ నాన్-స్టాప్ లైవ్ ఈ వారం అత్యధిక వీక్షకుల సంఖ్యను నమోదు చేయడమే అందుకు నిదర్శనం. బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఈ షోకి ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

Read Also : Acharya Event : కాజల్ ఊసే లేదు… విలన్ని కూడా పక్కన పెట్టేశారే !?

ఇక 8వ వారంలో బిందు, అజయ్, అఖిల్, హమీద, అనిల్, అషు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. కానీ బాబా భాస్కర్ బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక శక్తితో బిందును ఎలిమినేషన్ నుండి రక్షించారు. దీంతో అషు, హమిదా, అఖిల్, అజయ్, అనిల్ నామినేషన్లలో మిగిలారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో Bigg Boss Non Stop ఓటింగ్ ఫలితాల ప్రకారం హౌస్ నుండి అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. అఖిల్ పక్కన పెట్టడంతో అజయ్ కు ఓటింగ్ శాతం తగ్గిందని అంటున్నారు. మరోవైపు బిందు గురించి అఖిల్, అషుతో కబుర్లు చెప్పడంపై దృష్టి పెట్టినంతగా అతను నిజంగా గేమ్‌పై దృష్టి పెట్టలేదని ప్రేక్షకులలోని ఒక వర్గం చెబుతుంది. మరి ఈ సోషల్ మీడియా జోస్యం ఎంతమేరకు నిజం అవుతుంది ? అనేది తెలియాలంటే ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే ఎపిసోడ్ ను వీక్షించాల్సిందే.

Exit mobile version