NTV Telugu Site icon

Bigg Boss: బిగ్ బాస్ షోలో షాకింగ్ ఘటన.. లోపలికి వెళ్ళి కంటెస్టెంట్ అరెస్ట్

Bigg-Boss

Bigg-Boss

Bigg Boss Kannada 10 Contestant Arrest : బిగ్ బాస్ షో ఇండియాలో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎక్కడో విదేశాల్లో పుట్టిన ఈ షోని ముందుగా హిందీలో చేయగా అక్కడ వచ్చిన పాపులారిటీతో ఇండియాలోని అన్ని భాషల్లో మొదలు పెట్టేశారు. అలా కన్నడలో కూడా ఈ షో మొదలై ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా ముగించుకుని 10వ సీజన్ నడుస్తోంది. ఇక కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లో కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్ అరెస్టయ్యాడు. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా ఓ కంటెస్టెంట్ అరెస్ట్ అయ్యారని అంటున్నారు. షోలో ఉన్న వర్తూరు సంతోష్‌ పులి పంజాతో లాకెట్ వేసుకున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. షో జరుగుతున్న సమయంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. వర్తూరు సంతోష్‌ను రామోహళ్లి ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు మరియు ప్రస్తుతం రామోహళ్లి ఫారెస్ట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. మెడలో పులి పంజాతో లాకెట్ వేసుకున్నాడు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది.

Raja Singh: పద్నాలుగు నెలలు బీజేపీకి దూరంగా ఉన్నా..

వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అరెస్టు చేసిన వర్తూరు సంతోష్‌ను అటవీశాఖ అధికారులు విచారిస్తున్నారు. వర్తూర్ సంతోష్ చాలా జంతువులను పెంచుతాడు. పశువుల జాతిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన కృషి చేశారు. అంతే కాదు అతను ఆల్ ఇండియా హల్లికర్ బ్రీడ్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. సంతోష్ మెడలో పులి గోరు వేసుకున్న గొలుసు కనిపిస్తున్న కారణంగా అతనిని అరెస్టు చేశారు. టీవీలో పులి పంజా లాకెట్‌ను ధరించిన దృశ్యాన్ని గమనించి ఈ చర్యలు తీసుకున్నారు. కగ్గలిపూర్ అటవీ శాఖ కార్యాలయంలో సంతోష్‌ను విచారిస్తున్నారు. బెంగుళూరు ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవీంద్ర మాట్లాడుతూ అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని తెలిపారు. బిగ్ బాస్ హౌస్ నుంచి వర్తూరు సంతోష్ అరెస్ట్ అయ్యారనే వార్త ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతోంది. ఆదివారం రాత్రి బిగ్ బాస్ హౌస్ నుంచి ఆయన ధరించిన దుస్తులపైనే అరెస్ట్ చేసినట్టు సమాచారం. కన్నడ బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారిగా ఓ కంటెస్టెంట్‌ను ఇంటి నుంచి అరెస్ట్ చేశారు.