Dammu Srija : బిగ్ బాస్ హౌస్ లో దమ్ము శ్రీజ రచ్చ చేస్తోంది. అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయిన ఈ బ్యూటీ.. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్ట్రయిట్ గా మాట్లాడుతూ మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న శ్రీజ.. హౌస్ లో మాత్రం అందరిపై నోరు పారేసుకుంటోంది. ఈ విషయంపై ఆమె మీద ట్రోల్స్ బాగానే వస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై తాజాగా ఆమె తండ్రి శ్రీనివాసరావు స్పందించారు. నా కూతురు చిన్నప్పుడు గంజినీళ్లు తాగి స్కూల్ కు వెళ్లేది. చదువుల్లో ఎప్పుడూ ముందే ఉండేది. ఒక్క మార్కకు తక్కువ వేసినా ఊరుకునేది కాదు.
Read Also : Prabhas : ఆ విషయంలో ప్రభాస్ అందరికంటే తోపే..
నా కూతురు బిగ్ బాస్ కు వెళ్తానంటే నేను అడ్డు చెప్పలేదు. ఆమె మొన్న చెత్త ఏరే స్క్రిప్ట్ చేస్తే అందరూ ట్రోల్స్ చేశారు. నేను కూడా పారిశుధ్య కార్మికుడినే. చెత్త తీయడం అంటే మాటలు కాదు. చేతులతో తీసేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే తీస్తున్నాం. దాన్ని ఎలా ట్రోల్స్ చేస్తారు. ఆ విషయంలో చాలా బాధగా అనిపిస్తోంది. ఈ విషయంపై అందరూ ఒకసారి ఆలోచిస్తే బెటర్. నా కూతురు ఏ విషయంలో వెనక్కు రాదు. కచ్చితంగా సాధించేదాకా వెనకడుగు వేయదు అంటూ తెలిపాడు శ్రీజ తండ్రి.
Read Also : Mahesh Vitta : తినడానికి డబ్బులు లేకుంటే అలా చేసేవాడిని.. మహేశ్ విట్టా ఎమోషనల్
