NTV Telugu Site icon

చిరు ‘వేదాళం’ రీమేక్​లో బిగ్ బాస్ బ్యూటీ

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా తర్వాత చిరు వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ కాగా, వేదాళం రీమేక్ మరొకటి, బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ మూడవది. కాగా వేదాళం తమిళ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో బిగ్​బాస్ 4′ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దివి నటించనున్నట్లుగా తెలిపింది. రీసెంట్ గా దివి, శ్రీహాన్ జంటగా నటించిన ‘క్యాబ్​ స్టోరీస్’ ఈనెల 28న ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన దివి పలు విషయాలు చెప్పుకొచ్చింది. తాను చిరంజీవితో ‘వేదాళం’ రీమేక్‌లో తాను ఓ పాత్రలో నటించనున్నట్లు తెలిపింది. ఇటీవలే దర్శకుడు రమేష్‌ కథ వినిపించడాని.. చాలా బాగున్నట్లుగా దివి తెలిపింది.