Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇందులో మొత్తం 15 మంది ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీల హోదాలో 10 మంది, కామనర్స్ గా 5గురు వచ్చారు. అయితే చివర్లో నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. సెలబ్రిటీలను, కామనర్స్ ను రెండు గ్రూప్ లుగా డివైడ్ చేశాడు. ఈ సీజన్ లో రెండు హౌస్ లో ఉంటాయని.. ఓనర్స్, రెంట్ హౌస్ అని తెలిపాడు. ఓనర్స్ హౌస్ లో అగ్నిపరీక్షలో ఎంతో కష్టపడి వచ్చిన కామనర్స్ ఉంటారని.. రెంట్ హౌస్ లో సెలబ్రిటీలు ఉంటారని తెలిపాడు. రెంట్ హౌస్ లో అన్ని ఫెసిలిటీలు ఉంటాయని.. రెంట్ కట్టక్కర్లేదని తెలిపాడు.
Read Also : Dammu Srija : నెలకు లక్ష జీతం.. దమ్ము శ్రీజ గురించి షాకింగ్ నిజాలు
కానీ రెంట్ హౌస్ లో ఏమీ ఉండవని.. దానికి రెంట్ కూడా కట్టాలన్నాడు. సెలబ్రిటీల అసలు అగ్నిపరీక్ష ఇప్పుడే మొదలయిందని.. మీరు బాగా ఆడాలని తెలిపాడు. కామనర్స్ కు అగ్నిపరీక్షలో ఎన్ని రకాల ఇబ్బంది పెట్టే టాస్కులు ఇచ్చారో తెలిసిందే. అవి చూసిన ప్రేక్షకులు బిగ్ బాస్ మీద దుమ్మెత్తి పోశారు. ఆ షోలోకి వెళ్లాలంటే ఇన్ని రకాల ఇబ్బందులు పడాలా అని విమర్శలు గుప్పించారు. సెలబ్రిటీలకు అయితే ఇలాంటివి పెడుతారా అంటూ ఏకిపారేశారు. కామనర్స్ అంటే అంత చులకనగా ఉందా అనే నెగెటివిటీ బాగా పెరిగింది. దాన్ని కవర్ చేసేందుకే ఇప్పుడు కామనర్స్ కు బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. సెలబ్రిటీలకు ఇప్పుడు అసలైన అగ్నిపరీక్ష అంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అక్కడ అన్ని రకాల ఫెసిలిటీలు ఉన్నా.. చూసేవారికి అవేవీ లేనట్టే చూపించడం కామన్ కదా. మొత్తానికి నాగార్జునతో ఇలా చెప్పింది బిగ్ బాస్ కు అందరూ ఒక్కటే అనేలా ఫీలింగ్ కలిగించే ప్రయత్నం చేశారు.
Read Also : Bigg Boss 9 : మరీ ఓవర్ చేసిన మాస్క్ మ్యాన్ హరీష్.. ఇంత అవసరమా..?
