Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం కంప్లీట్ చేసుకుంది. శనివారంకు సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేయగా.. అందులో సంజనాకు సంబంధించిన ఇష్యూను చూపించారు. తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేయగా.. ఇందులో మాస్క్ మ్యాన్ హరీష్, ఇమ్మాన్యుయెల్ గొడవ గురించి నాగార్జున ప్రశ్నించారు. హరీష్ ను ఇమ్మాన్యుయెల్ గుండు అంకుల్ అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మాట్లాడిన నాగార్జున.. హరీష్ ను ఇమ్ము గుండు అంకుల్ అని సరదాగానే అన్నాడా లేదా అని హౌస్ మేట్స్ ను అడగ్గా.. అందరూ యస్ అన్నారు. దీంతో హరీష్ ముఖం వాడిపోయంది.
Read Also : Anil Sunkara : భోళా శంకర్.. చిరంజీవిని బ్లేమ్ చేయడానికే అలా చేశారు..
ఇంకో వీడియోలో ఇమ్మాన్యుయెల్, భరణి, తనూజతో పాటు ఉన్నప్పుడు హరీష్ వాళ్ల ముగ్గురిని ఆడాళ్లు అంటూ ఇన్ డైరెక్ట్ గా అన్న దాన్ని నాగార్జున చూపించారు. ఆ వీడియో చూసిన హరీష్.. నేనేం తప్పు చేయలేదు. కావాలనే నన్ను తప్పుగా చూపిస్తున్నారు అంటూ రివర్స్ అయ్యాడు. దీంతో నాగార్జున షాక్ అయిపోయాడు. నేను తప్పుగా చూపిస్తున్నానా అని నాగ్ అనడంతో.. తాను వెళ్లిపోతా అని హరీష్ అన్నాడు. అంత వరకే ప్రోమోను చూపించారు. నిజంగానే హరీష్ వెళ్లిపోయాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Read Also : Prabhas : మంచు ఫ్యామిలీకి అండగా ప్రభాస్.. గొప్పోనివయ్యా..
