Site icon NTV Telugu

Bigg Boss 6: వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుడిగాలి సుధీర్.. షేక్ ఆడించడమే..?

Sudeer

Sudeer

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6.. ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సీజన్.. అంతగా ప్రేక్షకాదరణ పొందడం లేదని టాక్ నడుస్తోంది. అందుకు కారణాలు రెండు ఉన్నాయి. మొదటిది ఈసారి ఈ సీజన్ లో జనాలకు తెలిసిన వారు ఎవరు లేకపోవడం. మరొకటి వీరందరికి ఆట ఆడడం సరిగ్గా రాకపోవడం. గేమ్ మీద ఫోకస్ చేయండి అంటే ఒకరిపై ఒకరు పర్సనల్ గ్రడ్జ్ ను పెట్టేకొని వాటిని నార్మల్ సమయంలో కూడా మాట్లాడుతూ ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తున్నారు. వీటివలనే ఈ సీజన్ అంతగా రేటింగ్ ను సంపాదించలేకపోతోంది అనేది అందరికి తెల్సిందే. ఇక దీంతో బిగ్ బాస్ యాజమాన్యం ఎలాగైనా ఈ సీజన్ రేటింగ్ ను పెంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ది మోస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ బుల్లితెర సుడిగాలి సుధీర్ ను హోస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ గా తీసుకొస్తున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ వరుస షోలు, సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇక బుల్లితెరపై సుధీర్ తెలియని వారుండరు. అందరికి అతనిపై కాస్తో కూస్తో అభిమానం ఉంది. ముఖ్యంగా సుధీర్ కంటూ ఒక అభిమాన సంఘమే ఉంది. దీంతో సుధీర్ ను కనుక హౌస్ లోనికి పంపితే వినోదానికి వినోదం.. రేటింగ్ కు రేటింగ్ వస్తుందని భావిస్తున్నారట యాజమాన్యం. డంతో సుధీర్ తో బిగ్ బాస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే హౌస్ లో ఇద్దరు జబర్దస్త్ నటులు చంటి, ఫైమా ఉన్నారు. ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీలో కూడా జబర్దస్త్ నటుడునే పంపిస్తే ఎలా..? ఇంకెవరైనా సీనియర్ నటుడును పంపిస్తే బావుంటుందని మరికొందరు అంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ గురించి తెలిసి సుధీర్ వెళ్తాడా..? అక్కడినుంచి బయటికి వచ్చినవారికి భవిష్యత్తు ఉండదని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాలను వదులుకొని బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళడానికి సుధీర్ ఒప్పుకుంటాడా..? అనేది అనుమానమే అని చెప్పాలి. ఇక సుధీర్ ఒప్పుకొని హౌస్ లోపలి వెళ్తే షేక్ ఆడించడం ఖాయమే అంటున్నారు సుధీర్ అభిమానులు. ఎన్నో కష్టాలను దాటుకొని స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు సుధీర్. ఎలాంటి ప్రలోభాలకు కానీ, కష్టాలకు కానీ తలా వంచడు. గేమ్ ను తనదైన రీతిలో ఆడి ప్రేక్షకుల మనసులను చూరగొట్టాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే సుధీర్ నోరు విప్పాల్సిందే..

Exit mobile version