Bigg Boss 6: ఎట్టకేలకు బుల్లితెర ప్రేక్షకులు కోరుకొనే వినోదం మొదలైపోయింది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 అంగరంగ వైభవంగా మొదలైపోయింది. వైట్ డ్రెస్ కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఇక మొట్టమొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి కీర్తి భట్ ఎంటరయ్యింది. మనసిచ్చి చూడు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కీర్తి ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ లో హిమగా నటిస్తోంది. ఇక ఆమె దీన గాఢ గురించి ఎన్నో షోలలో చెప్పుకొచ్చింది. ఒక పెద్ద యాక్సిడెంట్ లో కుటుంబాన్ని మొత్తం కోల్పోయి ఒంటరిగా మిగిలింది. అక్కడి నుంచి ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చేవరకు ఆమె ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు. అందుకు సంబంధించిన స్టోరీ కూడా ప్రేక్షకుల మనసులను చలింపజేసింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోకి ఎంటర్ అయ్యి స్నేహితులను పోగు చేసుకోవాలని, తనను తాను తెలుసుకోవడానికి ఈ షో కు వచ్చినట్లు చెప్పుకొచ్చింది.
Bigg Boss 6: తొలి కంటెస్టెంట్ గా ‘కార్తీక దీపం’ హీరోయిన్

Keerthy