Site icon NTV Telugu

Bigg boss 6: బాలాదిత్య బచ్ గయా!

Big Bos

Big Bos

 

బిగ్ బాస్ సీజన్ 6కు తొలి వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. ట్రాష్ టీమ్ లో ఉండి డైరెక్ట్ నామినేషన్స్ పొందిన బాలాదిత్య, అభినయశ్రీ, ఇనయా రెహ్మాన్ లో ఊహించని విధంగా బాలాదిత్య బచాయించాడు. బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. క్లాస్ టీమ్ లో ఉన్న కారణంగా గీతు, ఆదిరెడ్డి, నేహా చౌదరిని ఎవ్వరూ నామినేట్ చేయకుండానే కండీషన్ ను బిగ్ బాస్ పెట్టాడు. దాంతో వారు మినహా మిగిలిన వారిని నామినేట్ చేయాల్సింది ఇంటి సభ్యులను కోరాడు. దాంతో అత్యధికంగా సభ్యులు రేవంత్ పేరును పేర్కొనడం విశేషం. అతని బాడీ లాంగ్వేజ్, మాట తీరు చాలా చాలా అభ్యంతరకరంగా ఉందని మెజారిటీ సభ్యులు చెప్పుకొచ్చారు.

అలానే అందరితో సౌమ్యంగా ఉన్నట్టు కనబడుతున్న చలాకీ చంటీని సైతం ఎక్కువ మంది నామినేట్ చేశారు. ఇక సింగర్ శ్రీసత్యను తమతో మింగిల్ కావడానికి ప్రయత్నించడం లేదనే కారణంగా కొందరు నామినేట్ చేశారు. మొత్తం మీద రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమాతో పాటు బాలాదిత్య, అభినయశ్రీ, ఇనయా రెహ్మాన్ ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే అక్కడే బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరిని స్వాప్ చేసి నామినేషన్స్ ఉన్న వారిని ఇటు వైపుకు తీసుకు రావచ్చని చెప్పాడు. దాంతో సేఫ్ ప్లేస్ లో ఉన్న ఆరోహిని నామినేట్ చేసి, అటువైపు ఉన్న బాలాదిత్యను ఇంటి సభ్యులు సేఫ్ చేశారు. దాంతో ఇప్పుడు రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఆరోహి, అభినయశ్రీ, ఇనయా రెహ్మాన్ నామినేషన్స్ లో ఉన్నట్టయింది. మరి వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి.

Exit mobile version