డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ రాక్ స్టార్ యష్‌తో కలిసి.. కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికి కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కూడా అంతే క్రెడిట్ దక్కించుకుంది. దాంతో కెజియఫ్ తర్వాత అదే రేంజ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు హోంబలే అధినేతలు. ప్రస్తుతం ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక సలార్ తర్వాత కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. అందులోభాగంగా.. తమిళ్, మలయాళంలో భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలె పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. అలాగే అంతకుముందు.. లేడీ డైనమిక్ డైరెక్టర్ సుధా కొంగరతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఇందులో హీరో ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా.. ఈ ప్రాజెక్టులో సూర్య నటించబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను భారీ మల్టీ స్టారర్‌గా ప్లాన్ చేస్తున్నారట. అందులోభాగంగా.. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. దాంతో ఈ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.. త్వరలోనే ఇలాంటి విషయాల్లో ఓ క్లారిటీ రానుందట. గతంలో సూర్యతో కలిసి ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు సుధ కొంగర. దాంతో మరోసారి సూర్య మరియు హోంబలే ఫిల్మ్స్‌తో కలిసి బిగ్ స్క్రీన్ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోందట. హోంబలే ఫిల్మ్స్ కూడా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ప్రజెంట్ సూర్య.. బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏదేమైనా.. సూర్య-దుల్కర్ కాంబో ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
