కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న కల్పిత కథ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది.
అయితే..ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ సంబంధించిన వీడియో థీయ్ సాంగ్ ను ఇండియాలోని ఐదు భాషలకు చెందిన ఐదుగురు ప్రఖ్యాత సింగర్స్ పాడారని.. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవాళ 11 గంటల సమయంలో అధికారికంగా వెల్లడిస్తామని.. ఆర్‌ఆర్‌ఆర్ టీం తమ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది ఆర్‌ఆర్‌ఆర్ టీం. అయితే… ఈ సాంగ్ ఏంటి? ఎలా ఉంటుందోనని అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా.. ఈ సినిమా అక్టోబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.
