Site icon NTV Telugu

Bhumika : ‘ఖుషి’ జ్ఞాపకాల్లో హీరోయిన్… వీడియో వైరల్

Bhumika Chawla Birthday

Bhumika Chawla Birthday

‘ఖుషి’… అప్పట్లో ఓ సంచలనం… ఇప్పటికీ టాలీవుడ్ లో, ముఖ్యంగా పవన్ అభిమానులకు ఎవర్ గ్రీన్ మూవీ. మణిశర్మ సంగీతం సమకూర్చగా, ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం ఈ బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించారు ఇక ఆ సినిమాలోని పాటలు, సన్నివేశాలు యూత్ ను ఏ రేంజ్ లో అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నడుము సన్నివేశం ఓ అద్భుతం… పవన్ యాటిట్యూడ్, భూమిక స్వీట్ అండ్ క్యూట్ నెస్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ మూవీ వచ్చి 20 ఏళ్లకు పైగానే అవుతున్నా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ ప్లే లిస్ట్ లో ఉంటుంది.

Read Also : Aadavallu Meeku Johaarlu : సెల్ఫీతో అప్డేట్ ఇచ్చిన శర్వా, రష్మిక

సాంగ్స్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్… అందులో ‘అమ్మాయే సన్నగా’ సాంగ్ కూడా బాగుంటుంది. తాజాగా ఈ సినిమా జ్ఞాపకాలను నెమరేసుకుంది భూమిక. ‘అమ్మాయే సన్నగా’ సాంగ్ కు మరోసారి స్టెప్పులేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

https://www.instagram.com/reel/CaAGc77r0YW/?utm_medium=share_sheet

Exit mobile version