Bhoothaddam Bhaskar Narayana Trailer looks interesting: శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్రం ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ పరిశీలిస్తే కనుక ‘ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది, ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు”అనే న్యూస్ బులిటెన్ వాయిస్ మొదలై ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
Parasuram: చార్ట్ బస్టర్ గా ‘నందనందనా’…పరశురామ్ మ్యూజిక్ టేస్ట్ మస్త్
ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) ఎలా పరిష్కరించాడనేది చాలా థ్రిల్లింగ్ వేలో ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు. అయితే ముందుగా క్షీర సాగర మథనం అందులో నష్టపోయిన రాక్షసులను కూడా చూపడంతో అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? అని సస్పెన్స్ ని రేకెత్తిస్తూ ట్రైలర్ చివర్లో వచ్చిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చాలా ఎక్సైటింగ్ అనిపించేలా ఉన్నాయి. ట్రైలర్ లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బ్రిలియంట్ గా ఉంది. మొత్తానికి ట్రైలర్ సినిమా మీద చాలా క్యూరియాసిటీని పెంచింది.