Bhoothaddam Bhaskar Narayana: ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ని పంచుతుంది: నిర్మాతలు స్నేహాల్, శశిధర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhoothaddam Bhaskar Narayana Producers Snehal, Sashidhar Interview: శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు స్నేహాల్, శశిధర్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
మీ మూవీ జర్నీ ఎలా మొదలైయింది ?
– 2014లో షీష్మహల్ అనే ఇండిపెండెంట్ సినిమా చేశాం. 2020లో ‘నీతో’ అనే సినిమా చేశాం. 2022 భూతద్ధం భాస్కర్ నారాయణ కథ విన్నాం. స్క్రిప్ట్ అద్భుతంగా అనిపించింది. సినిమాని ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటీతో నిర్మించాం. అవుట్ అవుట్ అద్భుతంగా వచ్చింది. టీజర్ ట్రైలర్ పాటలు చాలా మంచి బజ్ ని క్రియేట్ చేయడం ఆనందంగా వుంది.
Also Read
- Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే... ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
భూతద్ధం భాస్కర్ నారాయణ ఎలా ఉండబోతుంది ?
-భూతద్ధం భాస్కర్ నారాయణ డిటెక్టివ్ థ్రిల్లర్. దర్శకుడు ఈ కథని చాలా కొత్తగా తీశారు. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్సు ఇస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ గేషన్ చాలా ఆసక్తిగా ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం వుంది.
శివ కందుకూరి పాత్ర గురించి ?
-డిటెక్టివ్ పాత్రలో శివ కందుకూరి గారు అద్భుతంగా చేశారు. ఇందులో డిటెక్టివ్ రోల్ రెగ్యులర్ కి భిన్నంగా ఉంటుంది. శివ కందుకూరి గారు ఈ పాత్రకు యాప్ట్. చాలా సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. అలాగే హీరోయిన్ రాశి సింగ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకు చాలా మంచి ప్రతిభ వుంది.
బడ్జెట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
-భూతద్ధం భాస్కర్ నారాయణ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఈ కథకు బడ్జెట్ కావాలి. మేము ముందు అనుకున్నదానికంటే ఎక్కువే అయ్యింది. అయితే కథకు కావలసినది సమకూర్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. సినిమా చాలా గ్రాండ్ గా వచ్చింది. బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఓవర్సిస్, ఓటీటీ బిజినెస్ క్లోజ్ అయ్యింది.
దర్శకుడు పురుషోత్తం రాజు గురించి ?
– పురుషోత్తం రాజ్ మంచి విజన్ ఉన్న దర్శకుడు. చాలా మంచి కథతో వచ్చారు. ఇందులో కథే హీరో. ఇప్పటివరకు ఇలాంటి కథని చూసి వుండరు. ప్రతి ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉంటుంది. దాని వెనుక ఉన్న కథ ఏమిటి ? దీనికి ఒక ఫాంటసీ ఎలిమెంట్ ని జోడించి ఈ కథని చాలా అద్భుతంగా తీశారు.
శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ గురించి ?
-శ్రీచరణ్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. ఆయన బిజీఎం మామూలుగా ఉండదు. బీజీఎం ని ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో శివ ట్రాన్స్ సాంగ్ లిరికల్ వీడియో కోసం ఏఐని వాడం. మా ప్రొడక్షన్ డిజైన్ ఇచ్చిన ఆర్ట్ ని ఏఐ కంటెంట్ కి సరిపడా అవుట్ పుట్ ఇచ్చింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజావార్తలు
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
-
IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!