Bhoothaddam Bhaskar Narayana Sucess Meet: శివ కందుకూరి హీరోగా నటించిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి థ్రిల్లింగ్-ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఇక ఈ సక్సెస్ మీట్ లో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ సినిమా మొదలుపెట్టినప్పుడు సినిమా బావోస్తే చాలు అనుకున్నాం, ఆ తర్వాత ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులకు రీచ్ అయితే చాలు అనుకున్నాం. అన్నిటికీ మించి ఒక మంచి హిట్ కొడితే బాగున్ను అనే కోరిక లోపల ఉండేది. ఈ క్రమంలో మా టీం అందరి కోరిక బలంగా వుంది. మేము అనుకున్న హిట్ ఈ సినిమాతో అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.
Vishwak Sen: ఆ సమయంలో భయమేసింది.. కానీ వాళ్ళ కోసం ఓర్చుకున్నా!
మాకు ఇంత మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ చాలా థాంక్స్ అన్నారు. సినిమా చూసిన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేక్షకులకు ఇవ్వాల్సిన విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ఈ సినిమాతో ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మరోసారి రుజువయింది, సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇది తెలుగు ఆడియన్స్ వలనే సాధ్యపడిందన్నారు. దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ.. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోందని, ఇది థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. అందరూ థియేటర్స్ లో చూడాలని అన్నారు. ఇక సినిమా నిర్మాతలు స్నేహాల్, శశిధర్ మాట్లాడుతూ.. సినిమాకి చాలా అద్భుతమైన స్పందన వస్తోందని, ఫుల్ ఫాల్ ప్రతి షోకి పెరుగుతుందని అన్నారు. చాలా చోట్ల హౌస్ ఫుల్ అవుతున్నాయి, సినిమా కంటెంట్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు.