Bhola shankar is remake of vedalam which pawan started and dropped in early stage : చిరంజీవి హీరోగా తమిళ వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. భోళా శంకర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తన్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సింది. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ తమిళ్లో సూపర్ హిట్ అయిన వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ ఇంట్రెస్ట్ చూపించారు. అజిత్ హీరోగా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కి తగ్గట్టు యాక్షన్, హీరోయిజం పుష్కలంగా ఉన్న క్రమంలో తమిళ్లో ఈ సినిమాను నిర్మించిన ఎఎం రత్నం తెలుగులో కూడా పవన్ హీరోగా నిర్మించాలని ప్లాన్ చేసి 11 అక్టోబర్ 2016లో లాంచ్ చేశారు. నీసన్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమాను ఎందుకో పవన్ రిజెక్ట్ చేశారు.
Pavan Sadineni: ‘దయా’ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్.. ఏకంగా ఆ హీరోతో సినిమా?
అయితే అదే సినిమాను మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘భోలా శంకర్’ పేరుతో తెరకెక్కించారు. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర భోలా శంకర్ అనే ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం, డడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవరిస్తన్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందించిన ఈ భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా దుమ్మురేపుతున్నాయి.