Site icon NTV Telugu

Malti Sharma: హీరోయిన్ అవుదామని వచ్చి బిచ్చం ఎత్తి, అరెస్టయి!

Malti Sharma

Malti Sharma

Bhojpuri Actress Malti Sharma Found Stealing and Begging In Mumbai Streets: గ్లామర్ ఫీల్డ్ మీద అందరి కళ్లు ఉంటాయి. చాలా మంది కలల నగరమైన ముంబైకి స్టార్ అవ్వాలని వెళ్లి సక్సెస్ కాకపోతే ఒక్కోసారి డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు లేదా రాంగ్ స్టెప్స్ వేస్తుంటారు. భోజ్‌పురి పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి మాలతి శర్మ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఒకప్పుడు భోజ్‌పురి నిర్మాతలు, దర్శకుల మొదటి ఎంపిక అయిన ఆమె సినిమాలు ఫ్లాప్ అవ్వడం ప్రారంభమవడంతో ఆమెకు పని దొరకలేదు. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. మాలతి శర్మ గ్లామర్ ప్రపంచంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని అనుకుంటే విధి ఆమెను వంచించింది. ఆమెకు అకస్మాత్తుగా పని లేకుండా పోయింది. ఆమెతో కలిసి పనిచేయాలనుకున్న వారే ఆమెను విస్మరించడం ప్రారంభించారు. పని లేకపోవడం, డబ్బు లేకపోవడంతో మిథాలీ శర్మ ముంబై చేరి భిక్షాటన కూడా చేయవలసి వచ్చింది. ఇక ఆమె నటించడం ఇష్టం లేకపోవడంతో ఆమె కుటుంబం అప్పటికే ఆమెను విడిచిపెట్టింది, కాబట్టి ఆమెకు తిరిగి వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

Deepavali: ఆసక్తికరంగా ‘దీపావళి’ ట్రైలర్… నవంబర్ 11న తెలుగు, తమిళ్ లో రిలీజ్‌!

వీధుల్లో భిక్షాటన చేయడమే కాకుండా దొంగతనం చేస్తూ మాలతి శర్మ పట్టుబడ్డారని తెలిసింది. ముంబైలోని లోఖండ్‌వాలా వీధుల్లో భిక్షాటన చేసే ఆమె ఒకసారి అక్కడ దొంగతనం చేస్తూ పట్టుబడింది, ఆ తర్వాత పోలీసులు ఆమెన్ అరెస్ట్ చేశారు. మిథాలీ మానసిక పరిస్థితి మరీ దారుణంగా ఉందని, మహిళా పోలీసులపై కూడా ఆమె దుర్భాషలాడిందని అంటున్నారు. నివేదికల ప్రకారం, పోలీసులు మాల్తీని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినప్పుడు, ఆమె అక్కడికి చేరుకోగానే ఆహారం అడిగిందని, ఆమె చాలా రోజులు ఆకలితో ఉందని గుర్తించారు. ఆమె మానసిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడంతో పోలీసులు ఆమెను థానేలోని మానసిక ఆశ్రమంలో చేర్చారు, అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పుడు మిథాలీ గురించి ఎలాంటి సమాచారం లేదు. న్యూస్ 18 హిందీ కథనం ప్రకారం మిథాలీ శర్మ ఢిల్లీ నివాసి అని, నటనలో కొనసాగడానికి ఇంటి నుండి పారిపోయి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబైకి చేరుకుంది. ఈ క్రమంలో అది నచ్చక పోవడంతో తన కుటుంబం ఆమెతో అన్ని సంబంధాలను తెంచుకుంది.

Exit mobile version