Site icon NTV Telugu

Pawan Kalyan: భీమ్లా నాయక్ వచ్చేశాడు.. అందరికీ నచ్చేశాడు..!!

పవర్‌స్టార్ అభిమానులలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈరోజే భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. దీంతో పవర్‌స్టార్ అభిమానుల హంగామా మాములుగా లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా టాక్ గురించి తెగ చర్చ నడుస్తోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద బ్యానర్లు, డప్పులు, దండలు.. ఇలా పవన్ అభిమానుల ఉత్సాహం ఉరకలెత్తుతోంది. సినిమా చూసిన జనాలు అంతా కూడా ఒకే మాట చెబుతున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ది బెస్ట్ ఇదేనని, నటన అదిరిపోయిందని, యాటిట్యూడ్ చూపించడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వారు లేరంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

https://ntvtelugu.com/power-star-pawan-kalyan-bheemla-nayak-movie-review-and-rating/
Exit mobile version