‘మదాలస – స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 1’ అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 4న, ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫీనిక్స్ అరేనాలో కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారులచే శాస్త్రీయ నృత్య రూపాలైన భరతనాట్యం, మోహినియాట్టం ప్రత్యేకంగా ప్రదర్శించబడినవి. ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన విద్వాన్ మంజు వి. నాయర్ గారు భరతనాట్యం ప్రదర్శన చేయగా, బెంగళూరుకు చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్రకుమార్ గారు మోహినియాట్టం ప్రదర్శన చేశారు. ఇక హైదరాబాద్ కు చెందిన విద్వాన్ సౌజన్య శ్రీనివాస్ గారు భరతనాట్య ప్రదర్శన చేశారు.
Also Read:Nayanathara : బాలయ్య సినిమాకి బడ్జెట్ దెబ్బ.. నయన్ అవుట్?
ఈ ముగ్గురు ప్రఖ్యాత కళాకారులు తమ అసాధారణ నృత్య ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. రాగమాలిక రాగంలో శ్రీ ఆదిశంకరాచార్య స్వరపరిచిన అర్ధనారీశ్వర స్తోత్రంకు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ భరతనాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. రాగమాలిక రాగంలో శివప్రసాద పంచకంకు శ్రీమతి మంజు నాయర్ భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. శ్రీ రాగంలో స్వరపరిచిన త్యాగరాజ కృతి అయిన ఎందరో మహానుభావులకు సౌజన్య శ్రీనివాస్ అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం శాస్త్రీయ కళా వైభవానికి అద్దం పట్టింది.
