NTV Telugu Site icon

TFC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్

Film Chamber

Film Chamber

Telugu Film Chamber: తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్‌రాజు పదవి కాలం ముగిసింది. ఆ పదవికి ఈసారి అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్ ఎన్నికయ్యారు. ఈ సారి పిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్ష పదవిని పంపిణీ రంగం నుంచి ఇచ్చారు. గతేడాది సినీ నిర్మాత అయిన దిల్ రాజుకు అవకాశం ఇచ్చారు. దిల్‌ రాజు పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు. ఏడాదికోసారి తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. మొత్తం సభ్యులు 48 మంది సభ్యులు, ఓటింగ్ లో పాల్గొన్న 46 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో భరత్ భూషణ్ (29 ఓట్లు), ఠాగూర్ మధు (17 ఓట్లు)తో భరత్ భూషణ్ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. మరోవైపు ఉపాధ్యక్ష పదవికి అశోక్‌కుమార్‌, వైవీఎస్‌ చౌదరి పోటీ పడుతున్నారు.ఉపాధ్యకుడు గా అశోక్ కుమార్ (28 ఓట్లు), వైవీఎస్ చౌదరి (18 ఓట్లు) నిర్మాతల నుంచి ఉపాధ్యక్షుడి ఎన్నికల జరుగుతున్నాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకుంటారు. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Show comments