ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్.. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నార్త్ లో ఎక్కడ చూసిన పుష్ప మానియా కనిపించింది. అలాంటి క్రేజ్ తెచ్చుకున్న పుష్ప సినిమాకు రెండవ భాగంగా పుష్ప ది రూల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్..
ఈ సినిమా షూటింగ్ మొదలు అయినప్పటి నుండి వరుస అప్డేట్స్ ఇచ్చి సినిమా పై హైప్ పెంచుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు..అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ గ్లిమ్స్ కూడా విడుదల చేసారు.సౌత్ కంటే కూడా నార్త్ ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సుకుమార్ ఎక్కడ కూడా అంచనాలు తగ్గకుండా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది..భారీ హైప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఆ వైరల్ అవుతున్న వార్త ఏమిటంటే.. ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాకు భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఎంతో హైలైట్ గా నిలువనుందని సమాచారం.మొదటి భాగంలో కూడా పుష్ప రాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు వస్తున్న సీక్వెల్ లో కూడా వీరి మధ్య అదిరిపోయే సన్నివేశాలు ఉండబోతున్నాయి అని సమాచారం. ఇప్పటికే భన్వర్ సింగ్ షూట్ ని కూడా పూర్తి చేసినట్లు అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు మేకర్స్.. ఇక ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ కావడంతో పుష్ప 2 పై క్రేజ్ మరింత పెరిగింది.
