Bhanu Sri Mehra: బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంత మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారో.. అసలు ఆ షో నచ్చదు అనేవారు చాలామందే ఉన్నారు. ఆ షో లో గొడవలు.. నటన, ఫేక్ ఎమోషన్స్ ఇలాంటివి నచ్చవు అనేవారు కొందరు అయితే.. అసలు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు అనేవారు ఇంకొందరు. ఈ నచ్చనివారిలో చాలామంది సెలబ్రిటీలుకూడా ఉండడం విశేషం. ఇప్పటికే నటి కస్తూరి తనకు బిగ్ బాస్ షో నచ్చదు అని ట్వీట్ చేసి సెన్సేషన్ సృష్టించింది. తాజాగా మరో నటి కూడా బిగ్ బాస్ ఒక చెత్త షో అని ట్వీట్ చేసి షాక్ ఇచ్చింది. ఆ నటి ఎవరో కాదు భానుశ్రీ మెహ్రా. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. సినిమా విడుదల అయ్యేవరకు అమ్మడి ముఖాన్ని దాచి ఉంచి ప్రమోషన్స్ చేశారు. దీంతో అసలు ఎవరు ఈ హీరోయిన్ అని అభిమానులు క్యూ కట్టి మరీ సినిమా చూసారు. కానీ, సినిమా కథ నచ్చకపోవడంతో వరుడు డిజాస్టర్ లిస్ట్ లోకి చేరింది.
Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి వెళ్లేవాళ్లు ఈ బట్టలే ధరించాలట!
ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న భాను.. కనీసం హీరోయిన్ గా కూడా కాలేకపోయింది. ప్రస్తుతం ఓటిటీ సిరీస్ లలో.. కొన్ని సినిమాలో నటిస్తున్న ఆమె తాజాగా బిగ్ బాస్ గురించి మాట్లాడింది. “బిగ్‌బాస్ షోని జనాలు ఎలా చూస్తున్నారా అని నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటాను. దానికి తోడు ఎప్పటికప్పడు కొత్త సీజన్స్ వస్తూనే ఉన్నాయి. నా దృష్టిలో ఇది ఓ చెత్త షో. నా ఇన్‌స్టా ఫీడ్ అంతా కూడా బిగ్‌బాస్ వీడియోలతో నిండిపోతోంది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నిన్ను ఎవరు చూడమన్నారు అని కొందరు.. అవును మాకు అలాగే అనిపిస్తుందని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.