Bhagyashri Borse: ఆ సూపర్ స్టార్‌తో డిన్నర్ డేట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన ‘లెనిన్’ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse: ‘లెనిన్’ సినిమాతో తన కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది. ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఆమె, టాలీవుడ్లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. వరుస అవకాశాలతో బిజీగా మారుతున్న ఈ బ్యూటీ తాజాగా తన మనసులో మాట పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ బోర్సేను, సినీ పరిశ్రమలో ఏ సెలబ్రిటీతో డిన్నర్ చేయాలని కోరుకుంటారని ప్రశ్నించారు. దీనికి ఆమె ఏమాత్రం ఆలోచించకుండా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పేరును చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా అనుష్క గురించి మాట్లాడుతూ, ఆమె తనకు ఎంతో ఇష్టమైన నటి మాత్రమే కాదని, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని భాగ్యశ్రీ ప్రశంసించింది. అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఆమె జర్నీని తాను ఎంతో అభిమానంతో గమనిస్తున్నానని వెల్లడించింది. నటిగా మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా అనుష్కను ఎంతో గౌరవిస్తానని చెప్పింది.
అవకాశం దొరికితే అనుష్కను దగ్గరగా కలుసుకుని, ఆమెతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలని తనకు ఎంతో కోరిక ఉందని భాగ్యశ్రీ తెలిపింది. ఆమె అనుభవాలు, ఆలోచనలు తెలుసుకోవాలని, కొంత సమయం కలిసి గడపాలని ఆశిస్తున్నట్లు చెప్పింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క శెట్టికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సింప్లిసిటీ, ప్రవర్తన, నటనతో ఆమె అభిమానులనే కాదు, సహనటులు, కొత్త తరానికి చెందిన నటీనటుల గౌరవాన్నీ సంపాదించుకున్నారు. అందుకే భాగ్యశ్రీ బోర్సే చేసిన ఈ వ్యాఖ్యలు కూడా అనుష్క అభిమానులను ఆనందానికి గురిచేస్తున్నాయి. మరోవైపు ‘లెనిన్’ విజయంతో భాగ్యశ్రీ బోర్సేకు టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలి హిట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, భవిష్యత్తులో కూడా విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తన కెరీర్‌ను మరింత బలంగా నిర్మించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
- Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
- Tags
- Bhagyashri Borse
- cinema
తాజావార్తలు
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!