Bhagyashree: నటి భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో అప్పట్లో కుర్రకారును మొత్తం తన వైపు తిప్పుకొంది. ప్రేమ పావురాలు సినిమాతో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొంది. ఇక ఇటీవలే రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ తల్లిగా రీ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ప్రస్తుతం హిందీలోనే ప్రజలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా నటి భాగ్యశ్రీ భర్త హిమాయ్ దాసానికి సర్జరీ జరిగింది. ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
“భుజంలోని రొటేటర్ కఫ్ సాయంతోనే చేతిని 360 డిగ్రీల కోణంలో తిప్పగలం. రొటేటర్ కఫ్ సరిగా లేదంటే కండరాలకు రక్తప్రసరణ ఆగిపోయి చేయి కదలిక కోల్పోతుంది. ఆ సమస్యతోనే ప్రస్తుతం నా భర్త బాధపడుతున్నారు. వైద్యులు నా భర్త భుజంలోని రొటేటర్ కఫ్‌కు శస్త్ర చికిత్స చేశారు. ఇందుకు నాలుగన్నర గంటల సమయం పట్టింది. ఇప్పుడతడు కోలుకుంటున్నాడు, తిరిగి నవ్వుతున్నాడు” అంటూ చెప్తూ ఆమె కూడా నవ్వులు చిందించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
