సినీ హీరోయిన్లకు అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలని అంటారు.. ఒక్క సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి.. మొన్నటివరకు శ్రీలీలా పేరు తెగ ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు టాలీవుడ్ బాగా వినిపిస్తుంది.. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది భాగ్యశ్రీ బోర్సే.. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడం విశేషం..
తాజాగా మరో క్రేజీ ఆఫర్ అమ్మడు దగ్గరకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఇటీవల సుజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా హీరోయిన్ గా భాగ్య శ్రీని ఎంపిక చేసినట్లు, ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయని తెలుస్తుంది.. ఇది కనుక ఫిక్స్ అయితే ఇక అమ్మడు నక్క తోక తొక్కినట్లే.. ఇప్పటికే విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుంది.. ఇప్పుడు ఈ సినిమా.. ఎంట్రీతోనే మూడు సినిమాల్లో నటిస్తుంది..
ఇక ఈ అమ్మడు ఓ యాడ్ లో నటించి సినిమాలో ఛాన్స్ లను అందుకుంది.. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌తో ఈ బ్యూటీ ఎక్కువగా ఫేమస్ అయింది. యారియాన్ 2లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన హరీష్ శంకర్ రవితేజ పక్కన జోడిగా ఫిక్స్ చేశాడు.. అలా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. మిస్టర్ బచ్చన్, విజయ్ దేవరకొండ, నాని ఇలా ముగ్గురు స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అంటే పాప లక్ మాములుగా లేదు.. మరి ఆ సినిమాలు ఏ మాత్రం హిట్ ను అందిస్తాయో చూడాలి..