NTV Telugu Site icon

Zee Telugu: ఈ ఆదివారం భగవంత్​ కేసరి వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్.. వరుణ్​ తేజ్​ ముఖ్య అతిథిగా సూపర్ జోడి ప్రారంభం

Bhagavanth Kesari

Bhagavanth Kesari

Bhagwanth Kesari world television premiere this Sunday: తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్స్​తోఅలరించే జీ తెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమై థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్​ ఎంటర్​టైనర్​ భగవంత్​ కేసరి సినిమాను వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​ గా టెలీకాస్ట్ చేయనుంది. అంతేకాదు అదే రోజు తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ జోడీతో కలిసి జంటగా తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సూపర్​ జోడీ వేదికను అందిస్తోంది. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్​ హిట్​ భగవంత్​ కేసరి ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు టెలీకాస్ట్ కానుండగా మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​ ముఖ్య అతిథిగా సూపర్ జోడి ప్రారంభం కానుంది. ఆ ప్రోగ్రాం ఇక మీదట, ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో టెలీకాస్ట్ కానుంది. ఇక చాలా రోజుల గ్యాప్​ తర్వాత ప్రముఖ యాంకర్ ఉదయభాను జీ తెలుగు సూపర్​ జోడి షోతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ షోకి న్యాయనిర్ణేతలుగా ఎవర్​గ్రీన్​ నటి మీనా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ వ్యవహరించనున్నారు..రఘు మాస్టర్​ కొరియోగ్రఫీ అనుభవం, శ్రీదేవి విజయ్​ కుమార్​ అందం ఈ షోని మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Neru Movie Review: ‘నెరు రివ్యూ’.. లాగిపెట్టి కొట్టాలనిపించేలా ప్రియమణి యాక్టింగ్

ఇక, ఈ షోలో 8 మంది సెలబ్రిటీ జోడీలు తమ అద్భుతమైన ప్రదర్శనలతో హోరాహోరీగా టైటిల్ కోసం పోటీపడనున్నారు. అయితే ఆ సెలబ్రిటీ జోడీలు ఎవరనేది తెలియాలంటే.. ఉత్కంఠభరితమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నా సూపర్​ జోడి ఎపిక్​ ప్రీమియర్​ ఎపిసోడ్​లు మీరు తప్పక చూడాల్సిందే. ఇక అదే రోజున భగవంత్​ కేసరి సినిమాను వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​గా జీ తెలుగు అందిస్తోంది. అనిల్​ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథ జైలు నుంచి విడుదలైన మాజీ పోలీస్​ అధికారి నేలకొండ భగవంత్​ కేసరి(బాలకృష్ణ) పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, కాజల్​ అగర్వాల్​, శ్రీ లీల ప్రధాన పాత్రల్లో నటించగా అర్జున్​ రాంపాల్​, పి. రవిశంకర్​, ఆర్​. శరత్​ కుమార్​, రఘుబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ భగవంత్​ కేసరి సినిమా వరల్డ్ టెలివిజన్​ ప్రీమియర్​గా మీ జీ తెలుగులో ఈ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా జీ తెలుగు ‘బనావో బేటీకో షేర్​’ కాంటెస్ట్​ని నిర్వహించనుంది. ఆడపిల్లల్ని పులిలా పెంచుతున్న తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్ చెబుతూ నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్​లో పాల్గొనాలంటే భగవంత్​ కేసరి సినిమా చూస్తూ మీ కూతురితో సెల్ఫీ తీసి టీవీలో కనిపించే ఫోన్​ నెంబర్​కు మిస్డ్​ కాల్​ ఇవ్వాలి, లేదా స్క్రీన్​పై కనిపించే క్యూఆర్​ కోడ్​ని స్కాన్​ చేసి సెల్ఫీ పంపించాలి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు సర్​ప్రైజ్​ గిఫ్ట్​ని పొందుతారు.