NTV Telugu Site icon

Bhagavanth Kesari: రౌడీ ఇన్స్పెక్టర్ రేంజులో భగవంత్ కేసరి…

Bhagavanth Kesari

Bhagavanth Kesari

బాలయ్యని నరసింహ నాయుడు, సమరసింహా రెడ్డి సినిమాలతో సీడెడ్ కింగ్ గా మార్చాడు డైరెక్టర్ బీ.గోపాల్. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే అది ఇండస్ట్రీ హిట్ అనే నమ్మకం ఉండేది జనాల్లో. పలనాటి బ్రహ్మనాయుడు సినిమా బీ.గోపిల్, బాలయ్య కాంబినేషన్ లో ఇంకో సినిమా పడకుండా చేసింది. 1990-2001 వరకూ పదేళ్లలో 4 సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా లారీ డ్రైవర్ అయితే రెండో సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ రామరాజుగా బాలయ్య మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేసాడు. బాలయ్య ప్లే చేసిన స్పెషల్ అండ్ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో ఇన్స్పెక్టర్ రామరాజు ఒకటి. ఇప్పుడు ఇలాంటి సినిమానే బాలయ్య నుంచి రాబోతోందా అంటే దాదాపు అవుననే సమాధానమే వినిపిస్తోంది.

రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోని ‘అరెవో సాంబ’ పాటని పటాస్ సినిమాలో వాడి థియేటర్స్ లో విజిల్స్ వేయించిన అనీల్ రావిపూడి… ఇప్పుడు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి హిట్ పక్కా అనే కాంప్లిమెంట్స్ ని సొంతం చేసుకుంది. బాలయ్యని తెలంగాణలో దించుతూ అనీల్ రావిపూడి రాసిన డైలాగ్స్ టీజర్, ట్రైలర్ లో బాగా పేలాయి. కామెడీ కూడా వర్కౌట్ అయ్యింది, దీంతో భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు పెరిగాయి. లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట ప్రకారం… భగవంత్ కేసరి సినిమాలో రౌడీ ఇన్స్పెక్టర్ ఛాయలు ఉంటాయి, ఈ సినిమా చూసిన వారికి రౌడీ ఇన్స్పెక్టర్ గుర్తొస్తుంది అంటున్నారు. అనీల్ రావిపూడి దాచిన సెకండ్ గెటప్ ఒకటి సినిమాలో ఉంది, బాలయ్య అందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అనే మాట వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలి అంటే అక్టోబర్ 19 వరకూ వెయిట్ చేయాల్సిందే.