చిత్ర పరిశ్రమలో నటీమణుల వరుస మరణాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.. మొన్నటికి మొన్న టీనా మాస్టర్ గోవాలో అనుమాస్పదంగా మృతి చెందింది.. ఇక అది మరువకముందే నిన్నటికి నిన్న కోలీవుడ్ మోడల్ షహనా బాత్ రూమ్ లో శవంలా కనిపించింది. ఇక ఈ రెండు ఘటనలను ఇంకా మరువక ముందే మరో నటి మృత్యువాత పడింది. ప్రముఖ బెంగాలీ సీరియల్ నటి పల్లవి డే ఆత్మహత్య చేసుకోంది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బెంగాలీ సీరియల్ నటి పల్లవి ‘ఆమీ సైరాజెర్ బేగం’, ‘రేష్మ జపి’, ‘కుంజో ఛాయ’, ‘సరస్వతి ప్రేమ్’, ‘మొన్ మనే నా’ వంటి పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె, తన ప్రియుడు షగ్నిక్ చక్రవర్తితో కలిసి కోల్ కత్తా లో ఒకే ఇంట్లో నివాసముంటోంది. గత కొన్ని రోజుల నుంచి షగ్నిక్, పల్లవి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
షగ్నిక్ రెండేళ్ల క్రితం ఓ అమ్మాయితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడని, ఆ విషయం ఈ మధ్యే తెలిసిందని, దాని వల్లే పల్లవి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సన్నహితులు చెప్తున్నారు. ఇక ఆదివారం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో పల్లవి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక అదే సమయంలో షగ్నిక్ సిగరెట్ తాగడానికి వెళ్లినట్లు చెప్పడం చాలా సిల్లీగా ఉందని, అతడే తన కూతురును చంపి, ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నాడని పల్లవి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రియుడు షగ్నిక్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులోనే పల్లవి మృత్యువాత పాడడం కడుశోచనీయమని పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
