Aindrila Sharma: చిత్ర పరిశ్రమలో గత రెండు నెలలుగా ఒకరి తరువాత ఒకరు మృత్యువాత పాడడంఆందోళనకు గురిచేస్తోంది. కృష్ణంరాజు, ఇందిరా దేవి, కృష్ణ, నిన్నటికి నిన్న డైరెక్టర్ మదన్ మృతి చెందారు.వీటిని ఇంకా జీర్ణించుకోకముందే మరో యంగ్ నటి గుండెపోటుతో కన్నుమూసింది. బెంగాలీ స్టార్ హీరోయిన్ అండ్రిలా శర్మ ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించింది. 24 ఏళ్ళ అండ్రిలా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నవంబర్ 1 న కోల్ కత్తా లోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటుంది.
ఇక ఆదివారం ఆమెకు సడెన్ గా గుండెపోటు రావడంతో వైద్యులు చికిత్స చేస్తుండగానే ఆమె మృతి చెందింది. యువనటి మరణంతో బెంగాలీ పరిశ్రమ తీవ్ర విషాదంలోకి జారిపోయింది. ఇక అండ్రిలా టీవీ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని హీరోయిన్ గా మారింది. అమీ దీదీ నెం 1, లవ్ కేఫ్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదాను తెచ్చుకొంది. అతి చిన్న వయస్సులోనే ఆమె మృత్యు వాత పడడం చాలా బాధాకరమని పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
