Benarjee: టాలీవుడ్ సీనియర్ నటుడు బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక మా ఎలక్షన్ అప్పుడు బెనర్జీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో మోహన్ బాబు తనను చెంపపై కొట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. ఇక ఆ విషయం గురించి మరోసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడంట బెనర్జీ. అమితాబ్ బచ్చన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఒక కన్నడ నటుడు రాని కారణంగా ఆ ప్లేస్ లో బెనర్జీ ని తీసుకోవడంతో నటుడిగా మారినట్లు చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి తనకు సినిమాలు లెక్క వేసుకోవడం, అవార్డులను ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేదన్న బెనర్జీ 50 ఏళ్ల వయసులో స్టైల్ కోసం సిగరెట్ తాగడం నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇక ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే తాను మా ఎలక్షన్స్ లో పాల్గొనడం చిరంజీవి వలనే జరిగిందని చెప్పాడు. ప్రకాష్ రాజ్ కొంతలో కొంతవరకైనా మంచి చేస్తాడని చిరు నమ్మి, మోహన్ బాబు తో మాట్లాడి ఓకే చేశాక మోహన్ బాబు, విష్ణు ను నిలబెట్టినట్లు చెప్పాడు. ఇక మోహన్ బాబు తనను చెంప మీద కొట్టిన సంఘటన గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్న ఆయన మోహన్ బాబు సంస్కారం ఏంటో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
