Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baththa: కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు బాలాజీ తరణీధరన్ మరోసారి చేతులు కలిపారు. ఇప్పటికే ‘నడువుల కొంజం పక్కత్త కానోం’, ‘సీతాకాతి’ వంటి విభిన్న సినిమాలతో మెప్పించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మూడోసారి ‘బత్తా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి ఈ ప్రాజెక్ట్‌కు స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అట్లీ సమర్పణలో, బాలాజీ తరణీధరన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి నిన్ననే (ఆగస్టు 12) టైటిల్‌తో కూడిన మాస్ రెట్రో లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో విజయ్ సేతుపతి ఎర్ర చొక్కా, సన్ గ్లాసెస్, మెడలో భారీ బంగారు గొలుసుతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. చేతిలో సిగరెట్‌తో ఆయన కనిపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే కథ, విజయ్ సేతుపతి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం చిత్ర బృందం సీక్రెట్ గానే ఉంచింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ తన ఏ ఫర్ యాపిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్‌కు చెందిన స్టార్ స్టూడియోస్, సినీ1 స్టూడియోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌తో చేతులు కలిపాయి. దీంతో ‘బత్తా’ మూవీపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి.
ఇక ఈ సినిమాలో జై భీమ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి, బాలాజీ తరణీధరన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ‘నడువుల కొంజం పక్కత్త కానోం’. బ్లాక్ కామెడీగా రూపొందిన ఆ సినిమాలో పెళ్లికి రెండు రోజుల ముందు తలకు గాయం కావడంతో గతాన్ని గుర్తుపట్టలేని వ్యక్తి కథను వినోదాత్మకంగా చూపించారు. ఆ తర్వాత ‘సీతాకాతితో’ మరోసారి కలిసి పనిచేశారు. ఇప్పుడు మూడోసారి ‘బత్తా’ కోసం కలవడంతో ఈ చిత్రంపై సహజంగానే ఆసక్తి ఏర్పడింది. అట్లీ స్వయంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ, ఈ కాంబినేషన్ మూడోసారి కలిస్తే అది ప్రత్యేకంగా ఉంటుందనే అర్థంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరో కొత్త తరహా పాత్రలో కనిపించే అవకాశం ఉందనే తెలుస్తోంది పోస్టర్ ని చూస్తుంటే.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
‘బత్తా’ను గాంధీ జయంతి కానుకగా 2026 అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఇండియా దక్కించుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ విడుదల తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘రాకా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. విజయ్ సేతుపతి కెరీర్ కూడా వరుస ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్’ చిత్రంలో నటిస్తున్నారు. రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’లో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అలాగే మాలవిక మోహనన్, రాజ్ బి. శెట్టి కలిసి నటిస్తున్న ‘పాకెట్ నవల్’లో దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజాతో మరోసారి ఆయన జతకట్టారు. ‘అరసన్’తో పాటు, మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి నటించబోయే చిత్రంలోనూ ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇలా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి, తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బాలాజీ తరణీధరన్తో మూడోసారి కలవడం ‘బత్తా’కు కూడా బజ్ క్రియేట్ అవుతోంది. అట్లీ నిర్మాణం, లిజోమోల్ జోస్ కీలక పాత్ర, సాయి అభ్యంకర్ సంగీతం, విజయ్ సేతుపతి స్టైలిష్ లుక్‌తో ఇప్పటికే హైప్ మొదలైంది. షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అక్టోబర్ 1న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఈ క్రేజీ కాంబినేషన్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!