Attitude Star Chandrahass : ఆది సాయి కుమారే నాకు స్ఫూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా సంపత్ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 1) నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు జయంత్ సి పరాన్జీ, జేడీ చక్రవర్తి, ఆది సాయి కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ ఈవెంట్‌లో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ .. ‘జయంత్ గారు తీసిన ‘తీన్ మార్’, ‘శంకర్ దాదా’ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆది అన్న అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆది అన్నే నాకు స్పూర్తి. జేడీ చక్రవర్తి అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. నాకోసం ఇంత మంది రావడం ఆనందంగా ఉంది. నన్ను కని, పెంచిన నా తండ్రి ప్రభాకర్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మేఘన తెలుగు చిత్రసీమలో పెద్ద హీరోయిన్ అవుతుంది. ధృవన్ చాలా టాలెంటెడ్. ఈ చిత్రం కోసం అద్భుతమైన పాటల్ని అందించాడు. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిన్ని, చందు, వెంకీకి థాంక్స్. ఈ ప్రాజెక్ట్ నాకు రావడానికి కారణమైన కెమెరామెన్ శేఖర్కి థాంక్స్. ఈ సినిమా ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. లెక్కపెట్టలేనన్ని, ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. ప్రారంభం నుంచి చివరి వరకు అలా కూర్చుని చూస్తుండిపోతారు. సంపత్ ఈ మూవీని గొప్పగా తీశారు. నన్ను బాగా చూపించారు. ఫిబ్రవరి 6న మా చిత్రాన్ని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
- Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
- Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. 'అంతా రాములోరు చూస్కుంటారు' అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
- Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
-
Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!