Megna Mukharjee: సౌరవ్ గంగూలీతో యాడ్‌లో నటించి.. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ!

  • సౌరవ్ గంగూలీతో యాడ్‌లో నటించిన మేఘనా ముఖర్జీ
  • టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మేఘనా ఎంట్రీ
  • ట్రెడిషన్‌కు ట్రెండీ టచ్ ఇచ్చిన మేఘనా
Megna Mukherjee

Megna Mukherjee

మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న మేఘనా ముఖర్జీ.. ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’లో మేఘనా కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేఘనా తాజా ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంప్రదాయ లుక్‌లో మెరిసిన ఆమె అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. స్కై బ్లూ లెహంగా, ఆరెంజ్ షేడ్ దుపట్టాలో ట్రెడిషన్‌కు ట్రెండీ టచ్ ఇచ్చారు.

చాలామందికి మేఘనా ముఖర్జీ అంటే మొదటగా గుర్తొచ్చేది.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నటించిన వైరల్ యాడ్‌లోని ‘మోనా డార్లింగ్’ పాత్రనే. ఆ ఒక్క యాడ్‌తోనే ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆమె తన ప్రతిభను ఒక్క యాడ్‌కే పరిమితం చేయకుండా.. ఫ్యాషన్, అడ్వర్టైజింగ్ రంగాల్లో మెరిశారు. టైటాన్, లోరియల్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కోసం చేసిన హై-ఫ్యాషన్ మోడలింగ్ క్యాంపెయిన్స్ ఆమె స్టైల్ సెన్స్‌కు నిదర్శనం. క్లాసిక్ ట్రెడిషనల్ లుక్స్ నుంచి మోడ్రన్ గ్లామర్ వరకు ఆమె ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

Also Read: Airtel Unlimited Plans 2026: ఎయిర్‌టెల్ నయా ప్రీపెయిడ్ ప్లాన్స్‌.. రూ.399, 449కే అన్‌లిమిటెడ్ డేటా!

మేఘనా ముఖర్జీ ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తాతో తెలుగులో డెబ్యూ ఇచ్చారు. సినిమాలో ఆమె పాత్ర కథకు కీలకంగా ఉండడంతో పాటు, యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. కొత్తదనం, ఫ్రెష్ ఫీల్‌తో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీలో మేఘన పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్. సినిమాలో మేఘనా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వసుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. టాలీవుడ్‌లో మేఘనా ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.