కింగ్ నాగార్జున, నాగ చైతన్యల మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు”. నాగార్జున, నాగ చైతన్య గతంలో ‘మనం’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలలో నటించారు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో విడుదలైన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా రూపొందుతోంది. ఈ రొమాంటిక్ డ్రామాలో రమ్య కృష్ణ, కృతి శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. న్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో వేదిక, మీనాక్షి చౌదరిలతో కలిసి నాగార్జున ఓ రొమాంటిక్ సాంగ్ చేయబోతున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.
Read Also : విడాకుల తర్వాత సమంతకు కలిసొచ్చిందా.. అరుదైన గౌరవం అందుకున్న కుందనపు బొమ్మ
యూనిట్ కీలక షెడ్యూల్ కోసం కర్ణాటకలోని మైసూర్‌లో అడుగు పెట్టింది. నిన్న సాయంత్రం నాగ్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, మిగతా కీలక సిబ్బంది ప్రత్యేక చార్టర్ విమానంలో మైసూర్ చేరుకున్నారు. “బంగార్రాజు” ఫస్ట్ సింగిల్ ‘లడ్డుండా’ సాంగ్ నవంబర్ 9న ఉదయం 9:09 గంటలకు విడుదల కానుంది.
