అక్కినేని నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం ఎట్టకేలకు ఓటిటి విడుదలకు సిద్ధమైంది. తండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండి ‘బంగార్రాజు’కు పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఒమిక్రాన్ భయంతో ఈ సినిమాను థియేటర్లలో చూడని చాలామంది అక్కినేని అభిమానులు ‘బంగార్రాజు’ డిజిటల్ విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను జీ5 భారీ ధరకు కొనుగోలు చేసింది.
Read Also : Khiladi : హీరోయిన్ కు సారీ చెప్పిన డైరెక్టర్… ఏం జరిగిందంటే ?
అయితే ఇప్పుడు ‘బంగార్రాజు’ చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధంగా ఉందంటూ టీం ప్రకటించింది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న ZEE5లో డిజిటల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. OTT ప్లాట్‌ఫాం అదే విషయాన్ని ప్రకటించడానికి అధికారిక ప్రోమోను విడుదల చేసింది. అనూప్ రూబెన్స్ సంగీతం, యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక ప్రస్తుతం నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా, నాగ చైతన్య ‘థాంక్స్’ మూవీని ముగించే పనిలో మునిగిపోయారు.
