Bangalore Police Came to Hyderabad for Grabbing Hema: బెంగళూరు డ్రగ్స్ కేసు (బెంగళూరు రేవ్‌పార్టీ)లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మే 19న ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించగా 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేసింది.
Producer Arrested: మత్తు మందిచ్చి రేప్.. కడుపు తీయించిన సినీ నిర్మాత అరెస్టు
27న విచారణకు హాజరుకావాలని పేర్కొనగా వైరల్ ఫీవర్ కారణంగా తాను నేడు విచారణకు హాజరు కాలేనని హేమ లేఖ రాశారు. దాంతో హేమపై బెంగళూరు సీసీబీ సీరియస్ అయి హేమకు మరో నోటీస్ ఇచ్చారు. అయినా హేమ విచారణకు హాజరు కాలేదు. దీంతో నటి హేమ కోసం హైదరాబాద్‌కు చేరుకున్నారు సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్యూరో) పోలీసులు. ఇప్పటికే రెండుసార్లు హేమకు నోటీసులు ఇచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణకు హాజరుకావాలంటూ పేర్కొన్నారు. రెండు సార్లువిచారణకు హాజరుకాకపోవడంతో హేమను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వచ్చినట్లుచెబుతున్నారు.