Site icon NTV Telugu

Bandla Ganesh: పూరి వలన స్టార్లు అయినా.. ఒక్క స్టార్ కూడా పట్టించుకోడు

Bandla Ganesh

Bandla Ganesh

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం నేడు ఆవాసా హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూరి జగన్నాథ్ ను ఏకిపారేశాడు. కొడుకు ఫంక్షన్ కు రాకుండా ముంబై లో ఉండడం పద్దతి కాదని, కుటుంబం కన్నా మనకు ఏది ముఖ్యం కాదని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా పూరి భార్య లావణ్య పడిన కష్టాలను, పూరి నడిపిన రిలేషన్స్ తో సహా చెప్పుకొచ్చి అబ్బురపరిచాడు.

ఆమె గురించి మాట్లాడుతూ ఒక స్త్రీ జాతి గర్వపడాల్సిన వారిలో.. ఒక తల్లి, ఒక అక్క, ఒక అమ్మ, ఒక భార్య, ఒక కోడలు, ఒక కూతురు ఎలా ఉండాలి నాటే నేను లావణ్య గారిలా ఉండాలని చెప్తాను. నేను సీతా దేవిను చూడలేదు కానీ.. ఆవిడలో సహనం, ఓపిక లావణ్య గారికి ఉన్నాయి. పూరి అన్నతో నేను చేసిన ప్రయాణంలో చాలా ఎక్కువ షేర్ మా వదినకు ఇస్తాను. ఎన్నో ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి.. అమ్మ కలకాలం ఉంటుంది.. జీవితాంతం ఆమెను కళ్లలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఆకాష్, పవిత్ర, పూరి అన్నది. పూరి ఏదో పెద్ద డైరెక్టర్ అవుతాడు, భూమిని బద్దలు కొడతాడు, ఇండస్ట్రీని దొబ్బేస్తాడు అని ఆమె పెళ్లి చేసుకోలేదు. పూరి జేబులో వందో, రెండొందలో ఉంటాయి.. వీడు నచ్చాడు. నాకు కన్ను కొట్టాడు అని చెప్పి లవ్ చేసి, సనత్ నగర్ లో మూడు ముళ్ళు వేస్తే స్కూటర్ ఎక్కి వచ్చేసింది. తర్వాత చాలా మంది ఆయన స్టార్ అయ్యాకా వచ్చారు కానీ ముందు వచ్చింది మహాతల్లి మాత్రమే..

పూరి ఎంతోమందిని స్టార్లను చేశాడు.. కానీ కొడుకును స్టార్ గా చేయలేకపోయాడు.. నా కొడుకు అయితే నేను లండన్ లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చేవాడిని. నేను బతికేదే నా కొడుకుల కోసం.. అన్న నువ్వెక్కడున్నావో ఎంత బిజీగా ఉన్నవో తెలియదు ఇంకోసారి ఈ పని మాత్రం చేయకు. ఎందుకంటే మనం ఏం సంపాదించినా బిడ్డల కోసమే.. మనం కన్నాం కాబట్టి మన బిడ్డలా బాధ్యత మనమే తీసుకోవాలి. బిడ్డల్ని కన్నావ్ కాబట్టి వారిని చచ్చేవరకు మోయాల్సిందే. కొడుకులో టాలెంట్ ఉంది.. ఎవరెవరికో స్టార్లను చేసావ్ .. సూపర్ స్టార్ లను చేసావ్ , మెగా స్టార్ లను చేసావ్, రెబల్ స్టార్ లను చేసావ్ .. నీ కొడుకు వచ్చేసరికి ముంబై లో వెళ్లి కుర్చున్నావ్.. నువ్వు చేసినా చేయకున్నా నీ కొడుకు స్టార్ అవుతాడు. నువ్వు కూడా నీ కొడుకు డేట్స్ అడిగే రోజు వస్తుంది రాసి పెట్టుకో.. చోర్ బజార్ మంచి సినిమా అందరూ చూసి ఎంకరేజ్ చేయండి.. నేను అయితే పూరి వలన స్టార్లు అయిన హీరోలందరూ వచ్చి పూరి గారి అబ్బాయి సినిమా ఉంది.. అందరూ చూడండి.. పూరి గారి వలన మేము స్టార్లమయ్యాం.. సూపర్ స్టార్లమయ్యాం అని చేప్తారేమో అని అనుకున్నాను. ఆయన వలన వారు ఇలా ఉన్నారు కదా ఆయన కొడుకును ఎంకరేజ్ చేసే బాధ్యత తీసుకుంటారనుకున్నా.. సినిమా కదా ఎవరు రారు. మాములే .. మనం తప్పు అనుకోకూడదు.. పూరి గారితో ఒక సినిమా చేస్తే చాలురా అనుకున్న వారు కూడా అప్పుడు పూరి గారి బాబును జోల పెట్టిన వారు కూడా రారు ఇప్పుడు.. సినిమా చాలా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నాను” అని చెప్పి ముగించాడు.

Exit mobile version