Site icon NTV Telugu

శ్రీగణపతి సచ్చిదానంద బయోపిక్‌ ప్రకటించిన బండ్ల గణేష్

Bandla-ganesh

Bandla-ganesh

ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీవితంపై బయోపిక్ తీయబోతున్నట్టు నిర్మాత, నటుడు గణేష్ ప్రకటించారు. సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామితో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు గణేశ్. నటుడిగా పేరు సంపాదించిన తర్వాత బండ్ల గణేష్ నిర్మాణ రంగంలోకి దిగాడు. ‘తీన్ మార్, ఆంజనేయులు, గబ్బర్ సింగ్, బాద్ షా, టెంపర్’ వంటి సినిమాలను నిర్మించాడు. ఆ తర్వాత కొంత కాలం రాజకీయ ప్రయాణం కూడా సాగించాడు. అయితే అది సరిగ్గా సాగకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. గతేడాద ‘సరిలేరు నీకెవ్వరు’లో చిన్న పాత్రతో మళ్ళీ నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు.

Read also : తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”

త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని అంటున్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం సచ్చిదానంద స్వామి బయోపిక్ ప్రకటనను చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ‘అప్పాజీ జీవిత చరిత్ర సినిమా చేసి తీరతా. ఆయన పాదాల సాక్షిగా అనుమతించారు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు’ అంటూ స్వామీజీతో దిగిన ఫోటోను గణేష్ ట్వీట్ చేశాడు. మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? సచ్చిదానంద స్వామి పాత్ర ఎవరు పోషిస్తారన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను బండ్ల గణేష్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డేగల బాబ్జీ’ సినిమా షూటింగ్ లో ఉంది.

https://twitter.com/ganeshbandla/status/1452108703612616708?t=5O4y0-7cC3iEPXPW9_V29w&s=08
Exit mobile version