NTV Telugu Site icon

Bhagavanth Kesari: మీడియా ముందుకి బాలయ్య అండ్ భగవంత్ కేసరి టీమ్

Bhagavanth Kesari

Bhagavanth Kesari

నందమూరి నట సింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ ఇప్పటివరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇటీవలే భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వరంగల్ లో గ్రాండ్ గా జరిగింది. లేటెస్ట్ గా భగవంత్ కేసరి టీమ్ అంతా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీ అయ్యారు. మరి కాసేపట్లో బాలయ్య, అనిల్ రావిపూడి అండ్ టీమ్ మీడియా ముందుకి రానున్నారు.

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా వదిలిన భగవంత్ కేసరి ట్రైలర్ సూపర్బ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్, హిందీలో పేలిన పంచ్ లైన్స్ ట్రైలర్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కొత్తగా కనిపిస్తున్నాడు. ట్రైలర్ తో భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాడు. ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ కి కాస్త టాక్ కూడా పాజిటివ్ గా తోడైతే చాలు బాలయ్య హ్యాట్రిక్ కొట్టేసినట్లే. అఖండ సినిమాతో వంద కోట్ల మార్క్ ని మొదటిసారి చేరుకున్న బాలయ్య, వెంటనే వీర సింహా సింహా రెడ్డితో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు బాలయ్యని సీనియర్ హీరోల్లో టాప్ పొజిషన్ లో కూర్చోబెట్టాయి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య మరోసారి హ్యాట్రిక్ కొడితే నందమూరి ఫ్యాన్స్ లో జోష్ మాములుగా ఉండదు.

Show comments