NTV Telugu Site icon

NBK 109: బాలకృష్ణ – బాబీ పని మొదలెట్టేశారు!

Nbk 109 Shoot Started

Nbk 109 Shoot Started

NBK 109 shooting Started: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘NBK109’ షూటింగ్ ఘనంగా ప్రారంభం అయింది. నందమూరి బాలకృష్ణ తన అద్భుతమైన 49 ఏళ్ళ సినీ ప్రయాణంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు మరియు భారీ బ్లాక్‌బస్టర్ విజయాలకు పర్యాయపదంగా మారారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన విలక్షణ శైలితో ఎన్నో గుర్తుండిపోయే అత్యంత శక్తివంతమైన పాత్రలకు ప్రాణం పోశారాయన. నందమూరి బాలకృష్ణ తెరపై గర్జించినప్పుడల్లా, చిరకాలం నిలిచిపోయే బాక్సాఫీస్ రికార్డులు ఆయన సొంతమవగా ఇప్పుడు బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో మరో భారీ యాక్షన్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. ఇటీవలి సంవత్సరాలలో తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలు నిర్మిస్తూ, దూసుకుపోతున్న విజయవంతమైన నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ యాక్షన్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి సిద్దం అయింది.

Nitish Kumar: మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు.. క్షమాపణలు చేప్పిన సీఎం నితీశ్

బాబీ కొల్లి ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో సరికొత్తగా రక్త పాతాన్ని పారించేందుకు సిద్దం అవుతున్నారు. ‘NBK109’ షూటింగ్ ఈరోజు(నవంబర్ 8) నుంచి ప్రారంభమైనట్లు తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూపిస్తున్నారు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు. ఇక ఇప్పటికే బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా విడుదలైన సృజనాత్మక పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి #NBK109 అనే టైటిల్ పెట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోండగా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Show comments