NTV Telugu Site icon

VSR Box-office: బాలయ్య సెంచరీ… బాక్సాఫీస్ దగ్గర గాడ్ ఆఫ్ మాసెస్ ర్యాంపేజ్

Veera Simha Reddy

Veera Simha Reddy

నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టేసాడు. జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలకృష్ణ, తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో ఎర్త్ శాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. మొదటి రోజే 50 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన వీర సింహా రెడ్డి సినిమా నాలుగు రోజుల్లోనే 104 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. బాలయ్య అభిమాని అయిన గోపీచంద్ మలినేని, ఒక ఫ్యాన్ బాలకృష్ణని ఎలా చూడాలి అనుకుంటున్నాడో అలానే చూపించి ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ ఇచ్చాడు. బాలయ్య రాయల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన చెప్పిన డైలాగ్స్ కి నందమూరి అభిమానులు థియేటర్స్ ని ‘జై బాలయ్య’ నినాదాలతో షేక్ చేస్తున్నారు.

ఫస్ట్ డే బాలయ్య కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ని రాబట్టిన వీర సింహా రెడ్డి సినిమా కలెక్షన్స్ సెకండ్ రోజు డ్రాప్ అయ్యాయి కానీ మూడు, నాలుగు రోజుల్లో సూపర్బ్ గ్రోత్ కనిపించింది. వాల్తేరు వీరయ్య రిలీజ్ అవ్వడంతో వీర సింహా రెడ్డి సినిమాకి థియేటర్స్ తగ్గాయి. లిమిటెడ్ థియేటర్స్ తోనే బాలయ్య ఈ రేంజ్ ర్యాంపేజ్ చూపిస్తున్నాడు అంటే బాలయ్యకి సరైన థియేటర్స్ దొరికితే ఈ పాటకి 150 కోట్ల గ్రాస్ ని రాబట్టే వాడు. సీడెడ్, ఓవర్సీస్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసిన వీర సింహా రెడ్డి సినిమా ఇప్పుడున్న ట్రెండ్ ని ఇలానే మైంటైన్ చేస్తే దాదాపు ఈ వీకెండ్ కి అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వడం గ్యారెంటీ. అయితే ఈ లోపు వీర సింహా రెడ్డి సినిమాకి థియేటర్స్ తగ్గకుండా ఉండాలి లేదంటే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వడం కష్టం అయ్యే అవకాశం ఉంది.

Show comments